ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

రూ.14.60 కోట్లతో ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ నిర్మాణం

శ్రీకాకుళం, నవంబర్ 29 : ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ ఆధ్వర్యంలో పారిశ్రామిక వాడ పైడి భీమవరంలో రూ.14.60 కోట్ల వ్యయంతో నిర్మించిన ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ ను వర్చువల్ పద్దతిలో ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి బుధవారం ఉదయం ప్రారంభించారు. కార్యక్రమానికి కలెక్టరెట్ వీడియో కాన్ఫెరెన్స్ హాల్ లో జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఈ ఒక్కరోజే రూ.­1,072 కోట్లతో రాష్ట్రంలో ఏర్పాటు చేసిన పలు ప్రాజెక్టులకు ప్రారంభో­త్సవాలు, శంకుస్థాప­నలు చేయడం. ఎంతో సంతోషంగా ఉందన్నారు. వీటిద్వారా 22 వేల మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో రాష్ట్రం అగ్ర స్థానంలో ఉందని ముఖ్యమంత్రి చెప్పారు.

జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ మాట్లాడుతూ రెండెకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ కాంప్లెక్స్ లో ఇప్పటికే రోడ్లు, విద్యుత్, ప్రహరీ, మంచినీటి సదుపాయం కల్పించామని ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు ఇక్కడ పరిశ్రమలను నెలకొల్పడం కోసం ప్రభుత్వపరంగా అన్ని సహాయ సహకారాలను అందిస్తామన్నారు. రానున్న రెండేళ్లలో 1500 మందికి ఇక్కడ ఉపాధి అవకాశాలు లభిస్తాయని, అలాగే రూ.30 కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తున్నామన్నారు. జిల్లాలో మూలపేట పోర్టు నిర్మాణం, విజయనగరం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణం పూర్తయితే పారిశ్రామికంగా జిల్లా మరింత అభివృద్ధి చెందనుందని చెప్పారు. సహాయ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, జిల్లా పరిశ్రమల శాఖ జి.ఎం ఉమా మహేశ్వర రావు, ఎపిఐఐసి జోనల్ మేనేజర్ బి.హరిధర రావు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments