శ్రీకాకుళం, నవంబర్ 29:- భారతీయ సంస్కృతి వారసత్వం సంపదపై అవగాహన అవసరమని, జిల్లాలో పర్యాటక ప్రదేశాలకు బహుళ ప్రచారాన్ని కల్పించి తద్వారా పర్యాటక ప్రదేశాన్ని తీసు కొచ్చెందుకు విద్యార్థులలో నైపుణ్యం, పరిశుబ్రత, వివిధ కార్యక్రమాలు చేయుటకు యువ పర్యాటక క్లబ్ లు దోహద పడతాయని జిల్లా పర్యాటక అధికారి ఎన్ నారాయణ రావు అన్నారు.
బుధవారం కళింగపట్నం కోకావారి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో యువక్లబ్ ఏర్పాటు కార్యక్రమంలో జిల్లా పర్యాటక అధికారి ఎన్ నారాయణ రావు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా జిల్లా పర్యాటక అధికారి మాట్లాడుతూ జిల్లా కలెక్టర్, పర్యాటకశాఖ కమిషనర్ ఆదేశాలననుసరించి ఈ యువ క్లబ్బులను ప్రారంభించడం జరుగుతుందన్నారు. ముందుగా ప్లాస్టిక్ వాడడం వలన కలిగే అనర్ధాలు పరిసరాల పరిశుభ్రత, మొక్కలు నాటి వాటిని పరిరక్షించాలని తదితర అంశాలపై విద్యార్థులకు వివరించారు.
ప్రతి ఒక్కరు మన పండగలు, జాతరలు, కళారుపాల పై ప్రస్తుతం యువతకు, భావితరాల వారికి తెలియజేయాలంటే నేటి యువత వాటిపై డాక్యూమెంట్ తీసి అవగాహన పెంపొందించు కోవాలన్నారు. యువ క్లబ్బుల వలన విద్యార్థులకు నైపుణ్యం పెంపొందు తుందన్నారు. యువ క్లబ్ ల ఆవశ్యకత వివరించారు. జిల్లాలో ఉన్న పలు పర్యాటక ప్రాంతాల ప్రముఖ్యత వివరించారు.
ఇంచార్జ్ ప్రిన్సిపల్ ఎం ఇందిరా మాట్లాడుతూ మండలంలో ఉన్న చరిత్ర కలిగిన ప్రదేశాల గురించి, పండగల గురించి విద్యార్థిని విద్యార్థులకు తెలియజేశారు. అలాగే ఆహారపు అలవాట్లు, ప్రతి విద్యార్థి ఉదయం లేవగానే వ్యాయామం చేయాలని విద్యార్థులకు వివరించడమైనది.
0 Comments