నిర్ణీత గడువులోపు ఇల్లు నిర్మాణాలు పూర్తి చేయాలని దానికి అధికారి యంత్రాంగం సన్నద్ధం కావాలని ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. ఆమదాలవలస మున్సిపల్ కార్యాలయంలో ఆమదాలవలస నియోజకవర్గానికి సంబంధించి నాలుగు మండలాలు మరియు మున్సిపాలిటీ సంబంధించి హౌసింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గాజుల కొల్లువలస లో సుమారు 1734 ఇళ్ల పట్టాలు మంజూరు చేసామన్నారు. ఇల్లు నిర్మాణాలు ఏ దశలో ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా పొందూరు,బూర్జ,సరుబుజ్జిలి లో వేసిన లేఅవుట్ లో ఇల్లు నిర్మాణలు ఎ దశలో ఉన్నాయో స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్పీకర్ తమ్మినేని మాట్లాడుతూ ఇప్పుడు నిర్మిస్తున్నది జగనన్న కాలనీలు కాదని క్రొత్తగా ఉల్లనే ఈ ప్రభుత్వం నిర్మిస్తుందని ఆయన తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇల్లు కట్టుకునే లబ్ధిదారులకు కోట్లు బిల్లులు చెల్లించిందన్నారు అందులో సిమెంటు ఐరన్ మొదలగు నిర్మాణ సామాగ్రికి కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. రాష్ట్రంలో 31 లక్ష పట్టాలిచ్చామని అందులో 8 లక్షల ఇల్లు నిర్మాణం పూర్తిచేసుకున్నాయని రెండో విడతగా ఐదు లక్షలు ఇల్లు జనవరి పూర్తి చేయాలని గడువు నిర్ణయించారని ఆయన అన్నారు. ఆముదాలవలసలో పెండింగ్లో ఉన్న గృహాలన్నీ త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు ఈ కార్యక్రమంలో హౌసింగ్ పీడీ గణపతి, డి ఈ అప్పారావు, ఏ ఈ లు నాలుగు మండలాలు మున్సిపాలిటీకి చెందిన వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
0 Comments