ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

జగనన్న పాలనలో భూ సంస్కరణలు. తమ్మినేని సీతారాం.18 మందికి అసైన్మెంట్‌ భూ పట్టాలు పంపిణీ

ఆముదాలవలస,నవంబర్ 28:
రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో భూ సంస్కరణలు ప్రతిష్టాత్మకంగా జరుగుతోందని ఏపీ శాసనసభాపతి తమ్మినేని సీతారాం  అన్నారు. మంగళవారం సభాపతి క్యాంపు కార్యాలయం వద్ద  ఆమదాలవలస మండలం మునగవలస గ్రామానికి చెందిన ముగ్గురు లబ్ధిదారులకు బూర్జ మండలం అయ్యవారిపేట గ్రామానికి చెందిన 15 మంది లబ్ధిదారులకు భూమిలేని నిరుపేదలకు అసైన్మెంట్‌ భూమికి పంపిణీ చేశారు.భూమి రిజిస్టర్‌ చేసిన సెటిల్మెంట్‌ పట్టాలను  సభాపతి అందజేశారు.ఈ సందర్భంగా సభాపతి తమ్మినేని మాట్లాడుతూ ప్రభుత్వం నిరుపేదలకు గతంలో ప్రభుత్వ భూమిని సాగు చేసుకునేందుకు అనుమతులు ఇచ్చేది అన్నారు.వాటిపై యాజమాన్య హక్కులు మాత్రం వారికి ఉండేది కాదన్నారు.ఈ విషయం గుర్తించిన రాష్ట్ర ముఖ్యమంత్రి సాగు చేస్తున్న ప్రభుత్వ భూమిపై యాజమాన్య హక్కులు సంపూర్ణంగా హక్కు దారులకే ఇచ్చేందుకు నిర్ణయించారన్నారు.వాటిని గుర్తించి తహసీల్దార్ ల ద్వారా అసైన్మెంట్ పట్టాలు పంపిణీ చేసినందుకు సీఎం నిర్ణయించారన్నారు.ఇటువంటి మనసున్న ముఖ్యమంత్రి దేశ చరిత్రలో ఇప్పటివరకు ఏ ఒక్కరూ  లేరన్నారు.నియోజకవర్గంలోని తహశీల్దారులు త్వరిత గతిన భూమిలేని పేదలకు పట్టాలు,డికేటి భూములకు సెటిల్మెంట్‌ పట్టాలు పంపిణీ వేగవంతం చేసేలా చర్యలు చేపట్టాలని కోరారు.ఇందుకు అవసరమైన అన్ని సహాయ సహకారాలు తాము అందిస్తామని తెలిపారు.భూ పంపిణీలో ఎక్కడా లంచాలకు తావు లేకుండా అధికారులు పారదర్శకతను పాటిస్తున్నారన్నారు.అర్హులైన లబ్దిదారులకు మాత్రమే భూమి అందేలా చూడాలని సభాపతి స్పష్టం చేశారు.ఇంత పెద్ద ఎత్తున సంక్షేమం,అభివృద్ధి,భూ సంస్కరణలు చేస్తున్న సీఎం జగనన్నను ప్రతి ఒక్కరూ గుండెల్లో పెట్టుకొని, రానున్న ఎన్నికల్లో ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బూర్జ తాహసిల్దార్ సనపల రమణమూర్తి ఆముదలవలస తాహసిల్దార్ గణపతి బూర్జ ఎంపీపీ ప్రతినిధి కర్నేన నాగేశ్వరరావు జడ్పిటిసి బెజ్జపురపు రామారావు  వైస్ ఎంపీపీ బుడుమూరు సూర్యారావు వెంకట సత్యం సిమ్మన్న శ్రీను కిషోర్ తదితర వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Post a Comment

0 Comments