శ్రీకాకుళం:అన్ని దానాల్లోనూ అన్నదానం గొప్పదని, అన్నార్తుల కోసమే అన్నాక్యాంటీను ఏర్పాటు చేసి పేదల ఆకలి తీరుస్తామని టిడిపి నియోజకవర్గ యువ నాయకులు,ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సర్పంచ్ ల సంఘ అధ్యక్షులు గొండు శంకర్ అన్నారు. టీడీపీ యువనాయకులు,ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సర్పంచ్‌ల సంఘ అధ్యక్షులు గొండు శంకర్ ఆధ్వర్యంలో నడుస్తున్న అన్నాక్యాంటీన్ బుధవారం 287 వ రోజు కొనసాగించారు. అలాగే పాత బస్టాండ్ లో 287 వ, రోజు కూడా అన్న క్యాంటీన్ ను నిర్వహించారు. అలాగే మొబైల్ వ్యాన్ల ద్వారా నగరంలో పల్చోట పేదలకు నిరాశ్రయులకు భోజనాలను అందజేశారు. ఈ సందర్బంగా శంకర్ మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల పార్టీ తెలుగుదేశం పార్టీ, మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం 2024 లో అధికారంలోకి వస్తుందన్నారు. 2024 లో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు మరలా అన్నా క్యాంటీన్లను కొనసాగిస్తారని చెప్పారు. అన్న క్యాంటీన్ ల ద్వారా ప్రతిరోజు జిల్లాలో వేలాది మంది కడుపు నింపుకునే వారన్నారు. చంద్రబాబునాయుడు మరలా ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు అనుకూలమైన పాలన అందిస్తారని, నేటి వైస్సార్సీపీ పాలనలో రాష్ట్రంలో పెరిగిన నిత్యావసరధరలతో పేదల, సామాన్యుల బతుకులు చిన్నాభిన్నమైనవని ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 550 మంది అన్నార్తులు భోజనాలు చేశారు. ఈకార్యక్రమంలో రఫీ గారు, నిజాముద్దీన్,కూర్మాన సుధ,sv రమణ,మోహన్,శాంత,ఆనంద్ ,ముత్యలమ్మ తదితరులు పాల్గొన్నారు.
0 Comments