ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

సమ్మె కాలానికి జీతాలు చెల్లించండి.

శ్రీకాకుళం:మున్సిపల్ కార్మికుల 16 రోజుల సమ్మె పోరాటానికి సంబంధించిన సమ్మె కాలం జీతం చెల్లించేందుకు ప్రభుత్వం జారీ చేసిన జీవో ఎంఎస్ నెంబర్-17 వెంటనే కార్మికులకు అమలు చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు, ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్(CITU)జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్.బలరాం కోరారు. బుధవారం శ్రీకాకుళం నగరపాలక సంస్థ కమిషనర్ చల్ల ఓబులేష్ గారిని ఆయన చాంబర్లో ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ సిఐటియు నాయకులు కలిసి సమ్మె కాలానికి వేతనాలు చెల్లిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీవో నెంబర్ 17ను తేదీ: 30/1/2024న జారీ చేసిన దానిని వెంటనే కార్మికులందరికీ అమలు చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోలో సమ్మె కాలానికి సమానంగా పరిధినాలలో పని చేయాలని నిబంధన పెట్టారని ఈ విషయమై రాష్ట్ర నాయకులు యూనియన్ తరపున ప్రిన్సిపల్ సెక్రటరీ వై శ్రీలక్ష్మి గారికి ఫోన్ ద్వారా అభ్యంతరం తెలియజేయడం జరిగిందని అన్నారు.  ప్రస్తుతం ఈ జీవో ద్వారా జనవరి జీతంలో సమ్మె కాలం జీతం కూడా చెల్లిస్తారు పని దినాలకు సంబంధించిన విషయం తర్వాత మనం చర్చిద్దాం ముందైతే జీతాలు తీసుకోండి అని చెప్పి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు రాష్ట్ర నాయకులకు చెప్పడం జరిగిందని అన్నారు. సమ్మె కాలం జీతం జనవరి జీతంతో కలిపి ఇవ్వమని ఆప్కాస్ కి ఆదేశాలు ఇచ్చినట్టుగా ప్రిన్సిపల్ సెక్రెటరీ గారు ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ రాష్ట్ర నాయకులకు తెలియజేశారని అన్నారు. పోరాడి విజయం సాధించిన మున్సిపల్ కార్మికులకు సిఐటియు తరఫున అభినందనలు తెలియజేశారు.
   ఈ వినతిపత్రంతో పాటు సమ్మె కాలపు జీతానికి సంబంధించిన జీవోను కూడా జత చేసి కమిషనర్ గారికి అందజేయడం జరిగింది.కమిషనర్ గారిని కలిసిన వారిలో ధనాల. యుగంధర్,అరుగుల. రాము, ఆకుల.శంకర్, ఆకుల.మోహన్, పొట్నూరు.గణేష్, జి.బుజ్జిఈశ్వరరావు, అర్జీ.శేఖర్, గోవిందు, ఆర్.ఈశ్వరమ్మ,ఎన్. పార్వతి తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments