ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

జిల్లాలో క్రొత్తగా, 4958 కార్డులను మంజూరు. జాయింట్ కలెక్టర్

శ్రీకాకుళం, జనవరి 05: జిల్లాలో క్రొత్తగా, 4958 కార్డులను మంజూరయ్యాయని జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా జిల్లాలో ప్రస్తుతం ఉన్న 6,70,325 కార్డుదారులకు ప్రతి నెలా బియ్యం మరియు నిత్యావసర సరుకులను పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు.
ద్వై వార్షిక పధకంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అర్హులై ఉండి, ఆగష్టు, 2023 నుండి డిసెంబర్ 2023 మధ్య క్రొత్త రైస్కార్డు మరియు కార్డు విభజన కొరకు దరఖాస్తు చేసుకున్న అర్హులైన వారందరికి కొత్త బియ్యం కార్డులను మంజూరు చేయడం జరిగినది. క్రొత్తగా మంజూరు చేసిన కార్డుదారులకు జనవరి నెల నుండే బియ్యం మరియు ఇతర నిత్యావసర సరుకులను పంపిణీ జరుగుతుంది. కావున క్రొత్తగా కార్డులు మంజూరు అయిన కార్డుదారు లందరూ, ఈ విషయం గమనించి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పంపిణీ చేయబడుతున్న బియ్యం మరియు నిత్యావసర సరుకులను MDU వాహనాల ద్వారా ఇంటివద్దనే పొందవలసినదిగా తెలియజేయడమైనదని జాయింట్ కలెక్టర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Post a Comment

0 Comments