ఎచ్చెర్ల, జనవరి 05 :- నిర్దేశిత మెనూను అందజేయాలని డైరెక్టర్ ఆచార్య కొక్కిరాల వెంకట ధన బాలాజీ అన్నారు. రాజీవ్ గాంధీ సాంకేతిక వైజ్ఞానిక విశ్వవిద్యాలయం రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఐఐఐ లో డైరెక్టర్ కొక్కిరాల బాలాజీ శుక్రవారం ఉదయం ఆకస్మికంగా మెస్ సందర్శించారు. ఉదయం తయారుచేసిన అల్పాహారం పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం విద్యార్థులుతో కలిసి సహపంక్తి అల్పాహారం చేశారు. విద్యార్థినీ విద్యార్థులకు అందజేసిన ఆహారం క్వాలిటీ విషయంలో యెక్కడా రాజీ పడవద్దుఅని ఐఐఐటి అధికారులను ఆదేశించారు.
శ్రీకాకుళం అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రామకృష్ణ ముని మరియు మెస్ కోఆర్డినేటర్లు ,తేజకిరణ్, లక్ష్మి నారాయణ,ప్రకాష్ రావు, మెస్ కమిటీ సభ్యులు మెస్ లను సందర్శించారు. ఆహారం తయారీకి వాడే అన్ని పదార్థాల నాణ్యత ను పరిశీలించారు. విద్యార్థులతో సమావేశం అయి వారి అభిప్రాయాలపై ఆరాతీశారు. అనంతరం మెస్ కమిటీతో సమావేశమై మాట్లాడుతూ మెరుగైన ఆహారం అందించడం ద్వారా విద్యార్థినీ విద్యార్థులు విద్యపై దృష్టి సారించే అవకాశం ఉందన్నారు. నాణ్యమైన ఆహారం అందించడం లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశంపై పలు సూచనలు, సలహాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో డైరెక్టర్ కేవీజీడీ బాలాజీ, ఓ.ఎస్.డి ఎల్.డి. సుధాకరబాబు, పరిపాలనఅధికారి మునిరామ కృష్ణ, డీన్ అకడమిక్స్ మోహన్ కృష్ణ చౌదరీ, డీన్ స్టూడెంట్ వెల్ఫేర్ గేదెల రవి, ఫినాన్స్ ఆఫీసర్ డా. అసిరి నాయుడు, చీఫ్ వార్డెన్ నర్సింహాఅప్పడు, ఉద్యోగులు, సహచర ఉద్యోగులు, విద్యార్ధులు పాల్గొన్నారు.
0 Comments