సారవకోట:- మండలంలోని లక్ష్మీపురంలో పెంచిన వైయస్సార్ పెన్షన్ 3000 రూపాయలు వైఎస్ఆర్సిపి కన్వీనర్ పొన్నాన ప్రసాద్ శుక్రవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం జగన్ ఇచ్చిన పింఛన్ పెంపు హామీ అమలు చేయడం జరిగిందన్నారు. జగన్ ఇచ్చిన హామీలలో 99% హామీలు అమలు చేశామని తెలిపారు. పింఛన్ పెంపుతో లబ్ధిదారులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది వైసిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
0 Comments