ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్

శ్రీకాకుళం, జనవరి 12: నిరుద్యోగ యువత స్వస్థలాల నుండే ఎంప్లాయిమెంట్ రిజిస్ట్రేషన్ కు అవకాసం జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ అన్నారు.

శుక్రవారం జిల్లా కలక్టర్ వారి కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా కలక్టర్ శ్రీకేష్ శ్రీకేష్ లాఠకర్ చేతుల మీదుగా జిల్లా ఉపాధి కార్యాలయం ఆన్లైన్ (online) వెబ్ పోర్టల్ employment.ap.gov.in ఫ్లయర్ విడుదల చేశారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సంబంధిత వెబ్ పోర్టల్ ద్వారా నిరుద్యోగ యువత వారి వారి స్వస్థలాల నుండే ఎంప్లాయిమెంట్ రిజిస్ట్రేషన్ చేసుకొనుటకు అవకాసం కలదని మరియు జిల్లా లోనే కాకుండా దేశం మొత్తం ఎక్కడైనా ఉద్యోగ, ఉపాధి కల్పన సమాచారం ఈ వెబ్ పోర్టల్ ద్వారా తెలుసుకోవచ్చని జిల్లా కలక్టర్ తెలియజేసారు. అభ్యర్థులు ఎంప్లాయిమెంట్ రిజిస్ట్రేషన్ చేసుకొనుటకు తమ విద్యార్హతలు, కుల దృవీకరణ పత్రం, ఆధార కార్డు, ఫోటో మరియు ఇతర సర్టిఫికెట్లను employment.ap.gov.in వెబ్ పోర్టల్ లో అప్ లోడ్ చేసుకొని, తమ వివరాలను నమోదు చేసుకోవలెను. వారు నమోదు చేసుకొన్నా వివరాలు సంబంధిత జిల్లా ఉపాధి కార్యాలయానికి చేరుతాయి. ఆ వివరాలను మరియు అప్ లోడ్ చేసిన సర్టిఫికెట్లను కార్యాలయంలో సరి చూసుకొని ఎంప్లాయిమెంట్ రిజిస్ట్రేషన్ కార్డు ను జనరేట్ చేయగా, సంబంధిత అభ్యర్థి ఎంప్లాయిమెంట్ రిజిస్ట్రేషన్ కార్డు ను ఆన్ లైన్ లోనే పొందవచ్చు. జిల్లా ఉపాధి (ఎంప్లాయిమెంట్ రిజిస్ట్రేషన్, రెన్యువల్ మరియు అదనపు అర్హతల నమోదు) అన్ని సులభరీతిన employment.ap.gov.in ద్వారా అందచేయబడుచున్నవి. పైన పేర్కొన్న సేవలు, అన్ని జిల్లా ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజిలు /మోడల్ కేరీర్ సెంటర్లు, ఇంటర్నెట్ సెంటర్లు మరియు మొబైలు ద్వారా కూడా పొందవచ్చు.

అభ్యర్ధులు ఆన్లైన్ (online) లో దరఖాస్తు చేసిన ఎడల వారికి లాగిన్ వివరములు మరియు తాత్కాలిక రిజిస్ట్రేషన్ నెంబర్ వెంటనే SMS ద్వారా పంపబడును. సంబంధిత జిల్లా ఉపాధి అధికారి వారి అభ్యర్ధులు ఆమోదించిన పిదప వారికి SMS ద్వారా ఎంప్లాయిమెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్ తెలియచేయబడును. అభ్యర్థితన ఎంప్లాయిమెంట్ కార్డు లాగిన్ ద్వారా డౌన్లోడ్ చేసుకోను సదుపాయము కల్పించబడినది.

వెబ్ పోర్టల్ పోస్టర్ విడుదల కార్యక్రమంలో జాయింట్ కలక్టరు ఎం నవీన్, జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతి రావు, శ్రీకాకుళం రెవెన్యూ డివిజనల్ అధికారి సి. హెచ్ రంగయ్య, టెక్కలి సబ్ కలక్టరు నూర్ కమల్, శ్రీమతి కె.సుధ, జిల్లా ఉపాధి అధికారి, ఎఎస్పీ విఠలేశ్వర రావు, తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments