ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

20న జవహర్ నవోదయ ప్రవేశ పరీక్షలు.

శ్రీకాకుళం, జనవరి 12: జవహర్ నవోదయ విద్యా సంస్థలో ప్రవేశాల కోసం ఈనెల 20వ తేదీన జరిగే పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు డీఆర్వో ఎం. గణపతి రావు తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం సంబంధిత అధికారులతో సమీక్ష సందర్భంలో ఆయన మాట్లాడారు. జిల్లాల్లో 7573 మంది మంది ఈ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారని, వారి కోసం జిల్లా వ్యాప్తంగా 30 కేంద్రాలను ఏర్పాటు చేశామని వివరించారు. 2024–25 విద్యా సంవత్సరానికి 6వ తరగతిలో ప్రవేశానికి జిల్లావ్యాప్తంగా ఈ నెల 20న ఉదయం 11:30 నుంచి 1: 30 గంటల వరకు ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు చెప్పారు. సమీక్షలో జిల్లా విద్యా శాఖాధికారి వెంకటేశ్వర రావు, నవోదయ ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, హెచ్ సెక్షన్ సూపరెంటెండెంట్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments