శ్రీకాకుళం,జనవరి,30:జిల్లాలో పనిచేయడం గొప్ప అదృష్టం గా భావించినట్లు జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ పేర్కొన్నారు. మున్సిపల్ పరిపాలన కమీషనర్ గా బదిలీ అయిన ఆయనకు జిల్లా అధికారులు బృందావనం ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన ఆత్మీయ వీడ్కోలు సభలో ఆయన మాట్లాడుతూ రెండు సంవత్సరాల ఎనిమిది నెలలు పని చేసినట్లు చెప్పారు. ఈ జిల్లాలో పనిచేసిన ఆనందం, జిల్లాలో పనిచేయడం గొప్ప అదృష్టమన్నారు. జిల్లాలో సంక్షేమ పథకాలు అమలులో జిల్లాకు సంబంధించిన ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు అందించిన సహయ సహకారాలు మరువలేనివన్నారు. జిల్లాతో విడదీయరాని బంధం గూర్చి వివరించారు. తాను ఏ శాఖలో పనిచేసినా జిల్లాకు తనవంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు.
జిల్లా ఎస్పీ జి.ఆర్. రాధిక మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ తో తనకున్న అనుబంధాన్ని వివరిస్తూ ఆయన సేవలు గూర్చి కొనియాడారు.
జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. నవీన్ మాట్లాడుతూ జిల్లాలో ఎనలేని సేవలందించినట్లు కొనియాడారు. జిల్లా కలెక్టర్ నుండి ఎంతో నేర్చుకున్నట్లు చెప్పారు. ఎప్పటి నుండి జిల్లాలో జరుగలేని పనులను ఆయన సాధించినట్లు వివరించారు. తనకున్న అనుబంధాన్ని చెప్పారు. జిల్లాలో ఆయన చేసిన సేవలను కొనియాడారు.
ఐటిడిఎ పిఓ కల్పన కుమారి మాట్లాడుతూ ఐటిడిఎ అభివృద్ధిలో తన వంతు సహాయ సహకారాలు అందించినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. టెక్కలి సబ్ కలెక్టర్ నూరుల్ కమర్, అసిస్టెంట్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, జిల్లా రెవెన్యూ అధికారి ఎం. గణపతిరావు, జిల్లా అధికారులు జిల్లాలో కలెక్టర్ చేసిన సేవలను కొనియాడుతూ ఆయనతో ఉన్న అనుబంధాన్ని వివరించారు. అనంతరం జిల్లా అధికారులు సత్కరించారు. ఈ ఆత్మీయ వీడ్కోలులో అదనపు ఎస్పీ తిప్పేస్వామి, జిల్లా అధికారులు,
తదితరులు పాల్గొన్నారు.
0 Comments