ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

మట్టిలో మాణిక్యాలు వెలికి తీయడానికే ఆడుదాం ఆంధ్రా. జెసి నవీన్, Ex.Dy CM కృష్ణదాస్

శ్రీకాకుళం, జనవరి 31 : మట్టిలో మాణిక్యాలను వెలికి తీయాలనే లక్ష్యం, ప్రతీ గ్రామంలోనూ వ్యాయామం ద్వారా ప్రతి మనిషి ఆరోగ్యానికి మేలు చేయాలనే సంకల్పం ఆడుదాం ఆంధ్రా కార్యక్రమంతో నెరవేరాయని, అంతర్జాతీయ క్రీడాకారులను వెలికి తీయడానికే ఆడుదాం ఆంధ్రా అని జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ అన్నారు.

నరసన్నపేట శాసనసభ్యులు, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ తో కలిసి కోడి రామ్మూర్తి స్టేడియంలో జిల్లాస్థాయి ఆడుదాం పోటీలను ఆయన ప్రారంభించారు. జిల్లా నుంచి రాష్ట్రస్థాయిలో ప్రాతినిధ్యం వహించేలా ఆయా జట్లు ఉత్తమ ప్రతిభను కనబరచాలని ఆయన కోరారు. జిల్లాలోని 8 నియోజకవర్గాల్లో క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, బ్యాట్మెంటన్ పోటీలలో ప్రధమ, ద్వితీయ స్థానాలు సాధించిన సచివాలయం జట్లు నాలుగు రోజులపాటు జిల్లా కేంద్రంలో పోటీలలో పాల్గొని ఇక్కడి నుంచి విశాఖలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు హాజరవుతాయని చెప్పారు. ఆరోగ్యం సరిగా ఉండాలంటే మన జీవితాల్లో క్రీడలు ఎంత అవసరం అని తెలియజెప్పడానికి ఆడుదాం ఆంధ్ర ఒక గొప్ప క్యాంపెయిన్‌గా ఉపయోగపడిందని అన్నారు. 

నరసన్నపేట శాసనసభ్యులు, మాజీ డిప్యూటీ సీఎం, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు ధర్మాన కృష్ణ దాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో తమ ప్రభుత్వం క్రీడలకు పెద్ద ఎత్తున మద్దతు పలికిందని, జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేయాలన్న లక్ష్యంతో ఆడుదాం ఆంధ్ర అనే గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టి దిగ్విజయంగా పోటీలు నిర్వహిస్తుందని అన్నారు. దశాబ్దాల క్రితం క్రీడాకారులు ఎలాంటి సౌకర్యాలు లేకుండా ఆటలు ఆడే వారిని గుర్తు చేసుకున్నారు. జగనన్న ప్రభుత్వం పూర్తిస్థాయిలో కిట్లను అందజేసి భోజన, వసతి సదుపాయాలు కూడా కల్పించి క్రీడాకారులకు ఎలాంటి లోటు లేకుండా చూస్తుందని వివరించారు. క్రీడల్లో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు.

తొలుత ఆయా జట్లను పరిచయం చేసుకున్న జెసి నవీన్, ఎమ్మెల్యే కృష్ణదాస్ లు బెలూన్లను, పావురాలను ఎగరేసి, క్రీడా పతాకాన్ని ఆవిష్కరించి పోటీలను ప్రారంభించారు. కృష్ణ దాస్, జెసి నవీన్ లు కాసేపు బ్యాటింగ్, వాలీబాల్ పోటీలను సర్వీస్ చేస్తూ ప్రారంభించారు. క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపి, రాష్ట్రస్థాయి పోటీలకు వెళ్లే జిల్లా జట్లకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందజేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్డిఓ శ్రీధర్, జిల్లా విద్యాశాఖ అధికారి కే. వెంకటేశ్వర్లు, సెట్ శ్రీ సీఈవో ప్రసాదరావు, శ్రీకాకుళం నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు, జిల్లా పర్యాటక శాఖ అధికారి ఎన్.నారాయణరావు, కోచ్ మాధురి, ఒలింపిక్ అసోసియేషన్ ప్రతినిధులు సుందర రావు మాస్టారు, సాంబ మూర్తి, స్కూల్ గేమ్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి రమణ, నెహ్రూ యువకేంద్రం కోఆర్డినేటర్ ఉజ్వల్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments