ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

హాస్టల్ విద్యార్థులకు ఫ్యాన్లు, లైట్లు వితరణ.- విద్యార్థులు ఉన్న‌త స్థాయికి చేరుకోవాలి- ఎస్ ఎస్ ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ డాక్ట‌ర్ సూర శ్రీ‌నివాస‌రావు

శ్రీకాకుళం:విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదివితే ఉన్న‌త స్థాయికి చేరుకుంటారని ఎస్ ఎస్ ఆర్ ఫౌండర్ డాక్ట‌ర్ సూర శ్రీ‌నివాస‌రావు అన్నారు. క్రమశిక్షణతో చదివితే లక్ష్యాలు చేరుకోవడం చాలా సులువు అని అన్నారు. ఇంటర్మీడియట్ డిగ్రీలోనే మీ భవిష్యత్తుని నిర్ణయించుకోవడం జరుగుతుందని అన్నారు. శ్రీకాకుళం నగరంలో ప్రభుత్వ బిసి బాలికల కళాశాల వసతిగృహం- 4 విద్యార్థినిలకు ఫ్యాన్లు అందించారు. ఈ సంద‌ర్భంగా సూర శ్రీ‌నివాస‌రావు మాట్లాడుతూ క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించడం ద్వారా ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. మీరంతా భారతదేశ వనితలగా ఎదగాలని ఆకాంక్షిస్తున్నాను అన్నారు. మీరంతా ఎంత క్రమశిక్షణగా ఉన్న తీరు చూస్తుంటే చాలా ఆనందంగా ఉందని అన్నారు.పరీక్షలు పెద్ద‌ సమస్య కానేకాదని, ఆత్మవిశ్వాసంతో ఇష్టంతో చదివి పరీక్షలకు సిద్ధం కావాలన్నారు. చదువుల్లో భవిష్యత్తులో రాణించాలంటే సానుకూల దృక్పథం కలిగి ఉండాలన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు పుష్పగుచ్చం అందించి దుస్సాలతో సత్కరించారు. ఫ్యాన్లు, లైట్లు వితరణ చేసినందుకు హాస్టల్ వార్డెన్ లలిత, విద్యార్థినిలు కృతజ్ఞతలు తెలియజేశారు.

Post a Comment

0 Comments