అందరూ వేడి చేసిన నీటిని త్రాగాలి
సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి
జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
శ్రీకాకుళం,జూలై,23: జిల్లాలో కంచిలి, కవిటి, మందస, ఎచ్చెర్ల, తదితరులు మండలాల్లో ఇతర మండలాల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైనట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మంగళవారం వెల్లడించారు. జిల్లాలో నాగావళి, వంశధార నదులు ఉన్న నేపధ్యంలో ఎగువ ప్రాంతాల నుండి వచ్చే నీరు ఐదు వేలు క్యూసెక్కుల వరకు వచ్చినట్లు ఆయన వివరించారు. నదుల వలన ఎక్కడా ఎలాంటి నష్టం వాటిల్లలేదని తెలిపారు. కాలువల వద్ద లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వరి పంటపొలాలు సుమారు 150 ఎకరాల వరకు ముంపుకు గురైందని సమాచారం వచ్చిందని, దీనికి సంబంధించి ప్రభుత్వానికి తెలియజేస్తామన్నారు. ఒక 6 వరకు గృహాలు డేమేజ్ అయ్యాయని, కొన్ని రోడ్లు పాడైనాయని, ఎలక్ట్రికల్ 5 లక్షల రూపాయలు వరకు ఫోల్స్ కు ఖర్చు అవుతుందని చెప్పారు. జిల్లా యంత్రాంగం అంతా పగడ్బందీగా ఉండడం వలన, ఆయా కేంద్రాల్లో యంత్రాంగం ఉండి ప్రజలను అప్రమత్తం చేయడం వలన ఎలాంటి మానవ, పశువులను నష్టపోలేదని, సముద్రంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులను నష్టపోలేదన్నారు. మత్స్యకారులకు సముద్రంలో చేపల వేటకు వెల్లరాదని సూచించినట్లు చెప్పారు.
*వర్షాల సమయంలో అందరూ శుభ్రతపై దృష్టి సారించాలి*
ప్రతీ మంగళవారం, శుక్రవారంలలో ఏంటీ లార్వా కార్యక్రమాలు చేయడం జరుగుతోందన్నారు. కలెక్టరేట్, ప్రభుత్వ కార్యాలయాలు, జిజిహెచ్, ఆసుపత్రుల్లో పూర్తిగా శుబ్రపరచే కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. ప్రతీ శుక్రవారం ప్రతీ ఇంటినీ శుబ్రపరచే కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. ఇందుకు సంబంధించి సచివాలయ సిబ్బంది, మలేరియా సిబ్బంది ఇంటింటికి వెళ్ళి మలేరియా, డెంగ్యూ వంటి వాటిపై తెలియజేస్తున్నట్లు చెప్పారు. ఇందుకు ప్రజల నుండి రెస్పాన్స్ వస్తుందన్నారు. ఇళ్లలో ఉండే ఫ్రిజ్ లకు వెనుక భాగంలో ఉండే బాక్స్, కూలర్ లు, ఇంటిపైన, ఇంటి బయట పనికిరాని వస్తువులలో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని కోరారు. ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని, మలేరియా, డెంగ్యూ లు మురుగు కాల్వలులో కాకుండా మంచి నీరు, వర్షపు నీళ్లలోనే జన్మిస్తాయని చెప్పారు. ప్రజలంతా మున్సిపల్, మలేరియా సిబ్బందికి సహకరించి డెంగ్యూ, మలేరియా రాకుండా నివారించేందుకు సహకరించాలని ఆయన కోరారు. భారీవర్షాలు తగ్గినప్పటికి వర్షాలు కొనసాగుతున్నందు వలనప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, అందరూ నీరు వేడి త్రాగాలని ఆయన కోరారు.
0 Comments