ప్రతీ రోజు పురోగతిపై చెప్పాలి
జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశం
శ్రీకాకుళం,జూలై,23: కోడి రామమూర్తి నిర్మాణం పనులు తక్షణమే ప్రారంభించి వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. కోడి రామమూర్తి మైదానం నిర్మాణం పనులను మంగళవారం ఆయన పరిశీలించారు. వర్షం కారణంగా పనులు ఇంకా ప్రారంభించలేదని కాంట్రాక్టర్ కలెక్టర్ కు వివరించారు. పనులకు సంబంధించి ఏ ఏ మెటీరియల్ ఎక్కడ నుండి వస్తున్నదీ తెలియజేయాలని ఎఈఈని ఆదేశించారు. లేబర్ ఎక్కడ నుండి వస్తున్నది ఆయన అడుగగా ఒరిస్సా నుండి వస్తున్నట్లు చెప్పగా పని వారికి సంబంధించిన వారి ప్రయాణ వివరాలు సేకరించాలని ఎఈఈని ఆదేశించారు. పెద్ద వర్షం పడితే తప్పా పనులు ఆపకూడదన్నారు. ఈ భవనంలో ఏ ఏ పనులు జరుగుతాయని ఆయన అడుగగా సీలింగ్ ప్లాస్టింగ్, బ్రిక్ వర్క్స్ ఉందని, భవనంపై మరో ఫ్లోర్ వేస్తామని ఆర్ అండ్ బి ఎస్ఈ జాన్ సుధాకర్ ఆయనకు వివరించారు. ఇసుక, ఇటుక, సిమెంట్ ఎంత అవసరమో తెలియజేయాలన్నారు. ప్లాస్టింగ్, బ్రిక్ వర్క్ ఎన్ని రోజులు పడుతుందని వరకు ఆయన అడగగా నెల రోజులు పడుతుందని ఎఈఈ చెప్పారు. ప్రతీ రోజు ఏ ఏ పని ఎంత జరుగుతుందో తెలియజేయాలని డీఈఈ గణపతిరావును ఆదేశించారు. ఇటుక ఎక్కడ నుండి వస్తుందని ఆయన అడుగగా చిలకపాలెం నుండి వస్తుందని తెలిపారు. పనులు త్వరితగతిన నాణ్యతతో ఉండాలని తెలిపారు. టాయిలెట్లు, ఎంట్రన్స్, తదితర ప్లాన్ అందజేయాలని ఆర్ అండ్ బి అధికారులను ఆదేశించారు. జూం కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయాలన్నారు. ఈ ప్రాంతానికి అవసరమైన జిమ్ ఎక్వూప్ మెంట్ ఏర్పాటు చేయాలని డిఎస్డీఓను ఆదేశించారు. శ్రీకాకుళం - ఆమదాలవలస రోడ్డు నిర్మాణం పనులపై చర్చించారు. ఈ పరిశీలనలో ఆర్ అండ్ బి ఎస్ఈ జాన్ సుధాకర్, ఈఈ ఎస్. రవి నాయక్, డిఎస్డీఓ శ్రీధర్, ఆర్ అండ్ బి డిఈ గణపతిరావు, ఎఈఈ పిటి రాజు, తదితరులు పాల్గొన్నారు.
0 Comments