*పదవీ కాలలో చేసిన సేవలే గుర్తింపునిస్తాయి*
*పదవీ విరమణ పొందిన జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వరరావు గారికి ఆత్మీయ సత్కారం*
శ్రీకాకుళం, జూలై 31: విద్యాశాఖలో జిల్లా విద్యాశాఖ అధికారిగా పనిచేసి పదవీ విరమణ పొందిన వెంకటేశ్వరరావు గారికి సహచర ఉద్యోగులు ఘనంగా సత్కరించారు. 41 సం.రాలు విద్యాశాఖలో పనిచేసి నేడు పదవీ విరమణ పొందుతున్న వెంకటేశ్వరరావు దంపతులకు అధికారులు, సిబ్బంది, యూనియన్ బేరర్స్, ప్రధానోపాధ్యాయులు బుధవారం గురజాడ కళాశాలలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో
ఘనంగా ఆత్మీయ వీడ్కోలు సత్కారం జరిగింది.
1985లో ఎపిపిఎస్సి సర్వీస్ కమిషన్ ద్వారా జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగంలో చేరిన వెంకటేశ్వరరావు ఎడి గా పదోన్నతి పొంది, డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ గా పాలకొండ, ఐటీడీఏ సీతంపేట, బొబ్బిలి, విజయనగరం జిల్లాలో విధులు నిర్వహించారు. విజయనగరం ఇంచార్జ్ డిఈఓగా. 1983 నుండి 1985 వరకు ఆరోగ్య శాఖలో పనిచేసి APPSC కేటాయింపు ద్వార DEO కార్యాలయానికి రావడం జరిగింది.
ఈ సందర్బంగా ఇతర అధికారులు సహోద్యోగులు వెంకటేశ్వరరావు సర్వీసులో చేసిన సేవలు గురించి గుర్తు చేసుకున్నారు. ప్రతి ప్రభుత్వ ఉద్యోగి పదవి విరమణ అనేది సహజమని వారి సర్వీసులో ఉండగా చేసిన సేవలు సహ ఉద్యోగులకు మార్గదర్శకంగా నిలుస్తాయన్నారు. పదవీ విరమణ అనంతరం ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలని సూచించారు. కుటుంబ సభ్యులతో ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. దుశ్సాలువలు, జ్ఞాపకాలను, ప్రశంసా పత్రాలు అందజేసి ఘనంగా సన్మానించి ఆత్మీయ వీడ్కోలు పలికారు.
పదవీ విరమణ పొందుతున్న వెంకటేశ్వర రావు మాట్లాడుతూ 1985వ సం.లో విద్యాశాఖలో విధుల్లో చేరడమైనదని. శ్రీకాకుళం జిల్లా విద్యాశాఖధికారిగా పదోన్నతి పై రావడం జరిగిందని అనంతరం జిల్లాలో జిల్లా విద్యాశాఖధికారిగా విధులు నిర్వహించడం చాలా ఆనందాన్ని కలిగించిందన్నారు. మనం మంచి చేస్తే మనల్ని ఎప్పుడు గుర్తు పెట్టు కుంటారని తెలిపారు. అలాగే నేను చేసిన సర్వీస్ లో నా పై అధికారులు, సహోద్యోగులు నావిధుల నిర్వహణకు అన్నివిధాల సహాయ సహకారాలు అందజేశారన్నారు.
ఈ ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమంలో స్నేహితులు, కుటుంబ సభ్యులు, సంఘాల నాయకులు, విజయనగరం జిల్లా అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
0 Comments