*జూవేనీలే పోలీసు అధికారులతో భేటీ*
*పిల్లల సంరక్షణ విధి లో పోలీసులదే ప్రధాన పాత్ర*
*జిల్లా న్యాయశాఖ అధికారి
సంస్థ ఆర్. సన్యాసి నాయుడు*
శ్రీకాకుళం, జూలై 31: గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికారి సంస్థ వారి ఆదేశాల మేరకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయశాఖ అధికారి సంస్థ వారి ఆదేశానుసారం సీనియర్ సివిల్ జడ్జి కార్యదర్శి జిల్లా న్యాయశాఖ అధికారి సంస్థ ఆర్. సన్యాసి నాయుడు స్థానిక న్యాయ సేవ సదన్ లో జువెనిల్ పోలీసు అధికారులతో న్యాయవిజ్ఞాన సదస్సు ఏర్పాటు చేశారు దీనిలో భాగంగా పోలీసు అధికారులకి పిల్లల పట్ల జరుగు అన్యాయాలకి తగు చర్యలు తీసుకోవడం లో చాకచాక్యం వహించాలని తెలిపారు. అలాగే బాల్య వివాహాలు జరగకుండా జువెనిల్ పోలీసులు అడ్డుకోవల్సిన బాధ్యత ఎంతైనా వుంది అని తెలిపారు.
మైనర్ బాల బాలికలకి ఏమైనా సమస్య ఉంటే వెంటనే చైల్డ్ వెల్ఫేర్ కమిటి ని ఆశ్రయించాలని తెలిపారు.
అలాగే పోలీసు అధికారులతో చర్చించి వారికి ఎదురైనా సమస్యలని అడిగి తెలుసుకొని పరిష్కరా మార్గపు సూచనలు ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో భాగంగా జి ఇందిరా ప్రసాద్, అడ్వకేట్, DCPO, రమణ పాల్గొన్నారు.
0 Comments