శ్రీకాకుళం జిల్లా నందిగాం డా. బి.ఆర్.అంబేద్కర్ గురుకులంలో ఇంటర్మీడియట్ విద్యనభ్యశిస్తున్న 16 ఏళ్ల బాలిక వసతి గృహంలో ఆత్మహత్య చేసుకున్న ఉదంతంపై జిల్లా అధికారులు,గురుకులం జిల్లా కో ఆర్డినేటర్ లు త్వరిత గతిన పూర్తి నివేదిక అందించాలని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు గొండు సీతారాం ఆదేశాలు జారీ చేశారు.
బుధవారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ఆయన మాట్లాడుతూ ఈ విద్యార్థిని మృతికి ఒత్తిడి వల్ల,లేక ఇతర కారణాలేవైనా ఉన్నాయా అన్నదానిపై సమగ్రంగా దర్యాప్తు జరిపి నివేదిక అందించాలని జారీ చేశారు,నివేదిక ఆధారంగా చట్ట ప్రకార చర్యలకు జిల్లా అధికారులకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ వివిధ సిఫారసులు చేయనున్నట్టు సీతారాం తెలిపారు.
0 Comments