నరసన్నపేట : మోసపూరిత హామీలు ఇవ్వడం, అధికారంలోకి రాగానే వాటిని మర్చిపోవడం చంద్రబాబు నాయుడుకు వెన్నతో పెట్టిన విద్య అని వైయస్సార్సీపి జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ దుయ్యబట్టారు. సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ చంద్రబాబు ప్రభుత్వం పూర్తిస్థాయిలో బడ్జెట్ ను ప్రవేశపెట్టకుండా, మరో 3 నెలలు ఓటాన్ అక్కౌంట్ వెళ్లిందని, సూపర్ సిక్స్ అమలు చేయిబోము అనడానికి ఇంతకంటే పెద్ద నిదర్శనం ఏముంటుందని విమర్శించారు.
రాష్ట్రం మొత్తం బడ్జెట్ ఎంత? అందులో ఆదాయాలు ఎంత? ఖర్చులు ఎంత? రాష్ట్రానికి ఉన్న రుణాల మొత్తం ఎంత? ఏయే శాఖలకు ఎంత? ఏయే పథకాలకు ఎంత ఖర్చు వంటి వివరాలు చెప్పాల్సి వస్తుందని ఈ ఎత్తుగడకు పాల్పడిందని తీవ్రంగా విమర్శించారు.
చంద్రబాబు అధికారంలోకి రాగానే రాష్ట్రం ఆర్థికంగా ధ్వంసం అయిపోయిందని, ఇప్పుడు ఏమీ చేయలేని పరిస్థితి ఉందని, క్రమం తప్పకుండా ఈ కథను చెప్పుకుంటూ వస్తున్నారని, అతని మీడియా ఈ రాష్ట్రానికున్న అప్పులు రూ.14 లక్షల కోట్లు అంటూ ఊదరగొట్టి, గుండెలు బాదేసుకున్నాయని గుర్తు చేస్తారు.
0 Comments