శ్రీకాకుళం: గతంలో ఎదురైయే సమస్యలు మళ్ళీ పునరావృతం కారాదు, ఎన్టీఆర్ భరోసా పింఛన్ లు పంపిణీ 1వ తేదీ నాడే శత శాతం జరగేలా ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు.
జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆగష్టు 1వ తేదీ ఉదయం 5.30కి పంపిణీ ప్రారభించి మొదటి రోజునే శత శాతం పంపిణీ జరగాలన్నారు. అందునిమిత్తం ముందస్తు చర్యలలో భాగంగా మునిసిపల్ కమిషనర్ లు, మండలం అభివృద్ధి అధికారులు ముందు రోజు నగదు బ్యాంకుల నుండి డ్రాచేయనుకోనేలా చర్యలు చేపట్టాలన్నారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ ల పంపిణీ నిమిత్తం సచివాలయ అన్ని శాఖల సిబ్బంది పాల్గొనాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహమద్ ఖాన్, జిల్లా రెవిన్యూ అధికారి ఎం గణపతి రావు, జిల్లా గ్రామీణ అభివృద్ధి ప్రాజెక్టు అధికారి కిరణ్ కుమార్, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి వెంకటేశ్వరరావు, లీడ్ బ్యాంకు మేనేజర్ సూర్య కిరణ్, గ్రామ, వార్డు సచివాలయ నోడల్ అధికారి వాసుదేవరావు తదితరులు హాజరైయారు.
0 Comments