నరసన్నపేటలోని ఒక అపార్ట్మెంట్లో వివాహిత ఆత్మహత్య చేసుకుంది. వివరాలకు వెళితే.. బుధవారం స్థానిక విఎస్ఆర్ ఎన్స్లేవ్ అపార్ట్మెంట్లో బరాటం అనురాధ (22) ఉరేసుకుని మృతి చెందిందని భర్త బరాటం శ్రవణ్ తెలిపారు. అయితే ఇది ఆత్మహత్య కాదని ఇది హత్య చేశారని మృతురాలి తల్లిదండ్రులతో పాటు బంధువులు ఆరోపించారు. ఘటనా స్థలాన్ని స్థానిక పోలీసులు పరిశీలిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
0 Comments