ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీలకు జిల్లా క్రీడాకారులు ఎంపిక:తైక్వాండో శ్రీను


*రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీలకు జిల్లా క్రీడాకారులు ఎంపిక*

👉ఈ నెల 31,వచ్చే నెల 1వ తేదిలలో తిరుపతి వేదికగా రాష్ట్ర స్థాయి పోటీలు
👉జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరచిన క్రీడాకారులు ఎంపిక
👉ఉత్సాహంగా జిల్లా స్థాయి తైక్వాండో పోటీలు
పోటీలను ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్‌ తైక్వాండో అసోసియేషన్ ఉపాధ్యక్షులు తైక్వాండో శ్రీను


శ్రీకాకుళం స్పోర్ట్స్ న్యూస్: 

రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీలకి జిల్లా క్రీడాకారులు ఎంపికయ్యారు. ఈ నెల 31,వచ్చే నెల 1వ తేదిలలో తిరుపతి వేదికగా వేర్వేరు రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీలు జరుగనుండగా జిల్లా స్థాయిలో ఆదివారం జట్టు ఎంపికలు నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా తైక్వాండో అసోసియేషన్ ఆద్వర్యంలో టౌన్ హాల్ వేదికగా జరిగిన పోటీలలో జిల్లా నలుమూలల నుంచి విచ్చే క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ పోటీలను ఆంధ్రప్రదేశ్ తైక్వాండో అసోసియేషన్ ఉపాధ్యక్షులు తైక్వాండో శ్రీను ప్రారంభించారు. ఈ సందర్భంగా తైక్వాండో శ్రీను మాట్లాడుతూ తిరుపతిలోని నేషనల్ సంస్కృత యూనివర్శిటీలోని ఇండోర్ స్టేడియంలో ఈ నెల 31 నుంచి వచ్చె నెల 1వ తేదిన రెండవ అస్మిత ఉమెన్స్ తైక్వాండో లీగ్(ఖేలో ఇండియా) -2024 పోటీలు జరుగనున్నాయన్నారు. అదేవిదంగా అదే తేదిలలో తిరుపతిలోని కరకంబడి రోడ్డులో గల తైక్వాండో అకాడమి లో 40వ ఏపి స్టేట్ సీనియర్ కుర్గీ,13వ ఏపి స్టేట్ పూమ్ సే తైక్వాండో చాంపియన్ షిప్స్ -2024 పోటీలు జరుగనున్నాయన్నారు. ఈ వేర్వేరు పోటీలకి సంబందించిన క్రీడాకారుల ఎంపిక చేయడం కోసం జిల్లా స్థాయి పోటీలు నిర్వహించామన్నారు. ఈ పోటీలలో ప్రతిభ కనబరచి రాష్ట్ర స్థాయి పోటీలకి ఎంపికైన వారు అక్కడ కూడా రాణించి జిల్లా పేరు ప్రతిష్టలను ఇనుమడింపజేయాలని తైక్వాండో శ్రీను పిలుపునిచ్చారు. 

👉 *అస్మిత ఉమెన్స్ తైక్వాండో లీగ్(ఖేలో ఇండియా) -2024కి ఎంపికైన క్రీడాకారులు వీరే*

తిరుపతిలోని నేషనల్ సంస్కృత యూనివర్శిటీలోని ఇండోర్ స్టేడియంలో ఈ నెల 31 నుంచి వచ్చె నెల 1వ తేదిన రెండవ అస్మిత ఉమెన్స్ తైక్వాండో లీగ్ -2024 పోటీలకి ఎంపికైన జిల్లా క్రీడాకారుల వివరాలను శ్రీకాకుళం జిల్లా తైక్వాండో అసోసియేషన్ ప్రతినిధులు ప్రకటించారు. కుర్గీ క్యాడెట్ అండర్ 55 కెజిల విభాగంలో బి.సాయి ప్రియ
జూనియర్ కుర్గీ అండర్ 42 కె.జిల విభాగంలో దనాల జ్యోశ్ని,బండి శిరీష,44కె.జిల విభాగంలో కె.చందు,అండర్ 63 కె.జిల విభాగంలో ఆర్.హాసిని, 68 కె.జిల విభాగంలో జి.దుర్గా భవానీ, ఓవర్ 68 కె.జిల విభాగంలో ఎస్ .నవ్య,జి.హౌనిత రాజ్ లు ఎంపికైనట్లుగా పేర్కొన్నారు. అదేవిదంగా సీనియర్ కుర్గీ లో అండర్ 46 కె.జిల విభాగంలో ఏ.మనీషా,ఎల్.జగదీశ్వరిలు, అండర్ 53 కె.జిల విభాగంలో వి.జాస్మిన్ ,వై.మౌనిక,అండర్ 57 కె.జిల విభాగంలో డి.నాగమ్మ.పూజిత
అండర్ 73లో ఏ.గాయత్రి,ఓవర్ 73లో సిహెచ్ సంధ్యారాణిలు,సీనియర్ పూమ్ సే ఇండివిడ్యూవల్ లో ఎల్ .జగదీశ్వరిలు ఎంపికైనట్లుగా తెలిపారు. 

👉 *సీనియర్స్ తైక్వాండో చాంపియన్ షిప్స్ పోటీలకి ఎంపికైన క్రీడాకారులు వీరే*

తిరుపతిలోని కరకంబడి రోడ్డులో గల తైక్వాండో అకాడమి లో ఈ నెల 31,వచ్చెనెల 1వ తేదిన జరుగనున్న 40వ ఏపి స్టేట్ సీనియర్ కుర్గీ,13వ ఏపి స్టేట్ పూమ్ సే తైక్వాండో చాంపియన్ షిప్స్ -2024 పోటీలకి ఎంపికైన క్రీడాకారుల వివరాలను అసోసియేషన్ ప్రతినిధులు ప్రకటించారు. కుర్గీ సీనియర్ పురుషుల కేటగిరిలో అండర్ 87 కె.జిల విభాగంలో జి.గణసాయి, మహిళల సీనియర్ విభాగంలో అండర్ 46 కె.జిలలో ఎ.మనీషా,ఎల్.జగదీశ్వరి, అండర్ 53 కె.జిల విభాగంలో వి.జాస్మిన్ ,వై.మౌనిక,అండర్ 57 కె.జిల విభాగంలో డి.ఆగనమ్మ,పూజిత,అండర్ 73 కె.జిల విభాగంలో ఏ.గాయత్రి ,ఓవర్ 73 కె.జిల విభాగంలో సిహెచ్.సంద్యారాణి,సీనియర్ మహిళా పూమ్ సే విభాగంలో ఇండివిడ్యూయల్ ఎల్ .జగదీశ్వరిలు ఎంపికైనట్లు తెలియజేసారు. ఎంపికైన ఈ టీంలకి కోచ్ లుగా మజ్జి గౌతమ్ ,మోర్తా సాయి బాలాజీ లు వ్యవహరించనున్నట్లుగా తెలియజేసారు. జిల్లా స్థాయి పోటీల నిర్వహణలో తైక్వాండో నవీన్ ,శాప్ కోచ్ లక్ష్మణ్ ,జోగిపాటి వంశీ,ఎన్ .శేఖర్ ,హరిలు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments