జలుమూరు: మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల హెచ్ఎం గా పనిచేస్తున్న మెండ రామారావుకు డే స్ప్రింగ్ ఇంటర్నేషనల్ యూని వర్సిటీ అధికారులు డాక్టరేట్ను సోమవారం విశాఖపట్నంలో ప్రదానం చేశారు. చేయూత ఎన్టీఓ సంస్థ ఆధ్వర్యంలో యూనివర్సిటీ చైర్మన్ పాల్ శ్యామల్ డాక్టర్ను అందించారు. భారతీయ విద్యా విధానం, ప్రపంచీకరణలో తీసుకువచ్చిన మార్పులపై చేసిన పరిశోధ నలకు డాక్టరేట్ దక్కిందని రామారావు తెలిపారు. చాన్సలర్ అమన్ జేమ్స్, పలువురు సాహిత్య వేత్తలు పాల్గొన్నారు. రామారావుకు డాక్టరేట్ దక్కడంపై ఎంఈఓలు మాధవరావు, ప్రసాదరావు, పలువురు ఉపాధ్యాయులు అభినందించారు.
0 Comments