ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

ఎస్.సి రిజర్వేషన్ల వర్గీకరణ తీర్పును పునఃసమీక్షించండి:అంబేద్కర్స్ ఇండియా మిషన్ తరపున పిటిషన్ వేసిన రాష్ట్ర ఉపాధ్యక్షుడు తైక్వాండో శ్రీను


*ఎస్.సి రిజర్వేషన్ల వర్గీకరణ తీర్పును పునఃసమీక్షించండి*

👉సుప్రీంకోర్టులో ఇంప్లీడ్ రివ్యూ పిటిషన్ వేసిన ఏఐమ్ 
👉అంబేద్కర్స్ ఇండియా మిషన్ తరపున పిటిషన్ వేసిన రాష్ట్ర ఉపాధ్యక్షుడు తైక్వాండో శ్రీను 
👉దళితుల ధైర్యం పి.వి.సునీల్ కుమార్ ప్రోత్సాహంతో న్యాయపోరాటం 

న్యూ ఢిల్లీ న్యూస్:

ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ అంబేద్కర్స్ ఇండియా మిషన్ తరపున రాష్ట్ర ఉపాధ్యక్షులు తైక్వాండో శ్రీను ఇంప్లీడ్ రివ్యూ పిటీషన్ ను దాఖలు చేసారు. ఈ మేరకు న్యూ ఢిల్లీ వెళ్ళి సుప్రీంకోర్టును ఆశ్రయించి న్యాయపోరాటం సాగిస్తున్నారు. సుప్రీంకోర్టులతో ప్రముఖ న్యాయవాదులతో చర్చించి న్యాయ సలహాలను తీసుకుని సీనియర్ న్యాయవాదుల ద్వారా కేసులను దాఖలు చేసారు. దళితుల ధైర్యం పి.వి.సునీల్ కుమార్ ప్రోత్సాహంతో ఏఐమ్ ఎస్ .సి రిజర్వేషన్ల వర్గీకరణకి వ్యతిరేకంగా పోరాటం సాగిస్తుంది. ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో వర్గీకరణ జరిగితే నష్టపోయే బాధిత వర్గాలకు సంబందించిన అన్ని సంఘాలతో ఏఐమ్ ఆద్వర్యంలో విజయవాడలో చర్చా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్రం నలుమూలల నుంచి విచ్చేసిన దళిత మేధావులు,సీనియర్ దళిత నాయకులు వారి అభిప్రాయాలను తెలియజేసారు.ఎస్.సి రిజర్వేషన్ల వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాడాలని ఆ సమావేశంలో నిర్ణయించారు. ఆ మేరకు అంబేద్కర్స్ ఇండియా మిషన్ చొరవ తీసుకుని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని న్యాయం పోరాటం చేస్తుంది. అందులో భాగంగానే ఏఐమ్ రాష్ట్ర ఉపాధ్యాక్షులు తైక్వాండో శ్రీను సుప్రీంకోర్టులో ఇంప్లీడ్ రివ్యూ పిటీషన్ ను వేసారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు మీడియా పాయింట్ వద్ద తైక్వాండో శ్రీను మాట్లాడుతూ ఎస్.సి రిజర్వేషన్ల వర్గీకరణ తీర్పు రాజ్యాంగ విరుద్దమన్నారు. ఆర్టికల్‌ 341ని సవరించకుండా షెడ్యూల్డ్‌ క్యాస్ట్‌లో కులాలను కలపడం గాని, తీసివేయడం గాని కుదరదన్నారు. అంటరానితనం ప్రాతిపదికన ఎస్సీ కులాలు ఏర్పడ్డాయని తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పును దేశమంతా ఖండిస్తోందని అన్నారు. నరేంద్ర మోదీ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం దళితులను విభజిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మందకృష్ణను ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధానమంత్రి మోదీ, ఇతర బీజేపీ నేతలు ఓటు బ్యాంకు కోసం వాడుకుంటున్నారని ఆరోపించారు. సుప్రీంకోర్టు తీర్పును పునః సమీక్షించి దళితులందరికి న్యాయం చేయాలని ఆకాంక్షిస్తున్నట్లుగా తైక్వాండో శ్రీను తెలిపారు. ఈ సమావేశంలో ఏఐమ్ న్యాయ సలహాదారులు ప్రముఖ న్యాయవాది తాడేపల్లి అజిత్ రాజు, దళిత జెఎసి నేత డా.కంఠ వేణు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments