ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

శ్రీ ముఖలింగేశ్వర ఆలయంలో నిత్య అన్నదానం లేదు. ప్రధాన అర్చకులు నాయుడు గారి రాజశేఖర్

శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలంలో దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీముఖలింగం పుణ్యక్షేత్రంలో నిత్య అన్నదాన పథకం లేదని భక్తులు అందరూ గమనించాలని శ్రీ ముఖలింగేశ్వర ఆలయ ప్రధాన అర్చకులు నాయుడు గారి రాజశేఖర్ తెలిపారు.కార్తీక మాసం వస్తున్న సందర్భంగా కొందరు దళారులు ఇప్పటికీ అన్నదానం పేరిట అక్రమ వసూళ్లు చేయడానికి ప్రయత్నిస్తున్నారని తెలిపారు. గత సంవత్సరం 2024 కార్తీక మాసంలో అప్పటి దేవాదాయ సిబ్బంది మరియు కొంతమంది దళారులు కలిసి నిత్య అన్నదాన పథకం ఉందని, మాయ మాటలు చెప్పి భారీ మొత్తంలో భక్తుల నుండి వసూలు చేశారని విమర్శించారు. కాబట్టి ఈ సంవత్సరం అటువంటి మోసగాలను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. గత ఐదేళ్లుగా కార్తీక మాసంలో నిత్యాన్నదానానికి విరాళాలు భక్తుల నుండి భారీ మొత్తంలో వసూలు చేశారన్నారు. ఇప్పటికే నిత్య అన్నదానం పేరుతో కోట్ల రూపాయలు వసూలు చేసి అన్న వితరణలు మాత్రం చేపట్టలేదని వివరించారు. ఇప్పటికైనా భక్తులు గమనించి అన్నప్రసాదానికి వితరణ పేరుతో విరాళాలు అందించవద్దని కోరారు. స్వయంగా భక్తులు ఆలయం నకు ఏదో ఒక రూపంలో ఆలయ ప్రాంగణంలో మాత్రమే సేవలందించాలి కోరారు. ప్రస్తుతానికి భక్తులకు వసతి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

Post a Comment

0 Comments