💐💐💐💐💐💐💐
_నేడు కృష్ణాష్టమి_
***********************
*_యుగానికో ధర్మం.._*
*_అదేగా శ్రీకృష్ణుని మర్మం.._*
ఆడితప్పక రాముడు ఆదర్శప్రాయుడైతే
పూటకో నాటకమాడి
*_జగన్నాటక సూత్రధారి_*
అయ్యాడు నల్లనయ్య..!
ముగ్గురమ్మల ముద్దులకూనగా
రాముని బాల్యం
మధురాతి మధురం..
మధురలో పుట్టినా
కిష్టయ్య చిన్నతనం
దినదిన గండం..
కారాగారంలో జననం..
పసిగుడ్డుగా బుట్టలో
జడివానలో పయనం..
అటు రేపల్లెలో
పేరుకే వ్యాహ్యాళి
*_అడుగడుగునా మృత్యుకేళి..!_*
హరివిల్లు విరిచి సీతమ్మను మనువాడితే రామయ్య
ఎత్తుకొచ్చి రుక్మిణమ్మని
కన్నెల దొంగ
కాలేదా కృష్ణయ్య
ఆలిపై నిందవేస్తే రఘుపతి
*_తానే నిందలు మోసె శ్రీపతి..!_*
సత్యసంధుడై రామయ్య
కీర్తిగాంచితే..
పొసగని సంధి..
పార్ధుని సారధి..
దార్తరాష్ట్ర విరోధి..
ఎన్ని పేరులో..
ఎన్నెన్ని తారుమారులో
ఈ లీలావినోదికి..
హతవిధీ..!
వంశోద్ధారకుడను కీర్తితో
తానుగా అవతారపరిసమాప్తి గావించినాడు రామయ్య..
వంశక్షయంబునకు కారకుడై
ఖేదమున ఒంటరై..
శరాఘాతమ్ముతో
*_మహాభినిష్క్రమణం_*
చేసినాడు మాధవుడు..!_*
మాయలే చేసినా..
మంత్రాలే పన్నినా..
అంతటి రణానికి
తానే కారణమైనా..
సత్యధర్మాలే బంధుగణం..
దీనజనోద్ధరణే గుణం..
*_అవతార ధర్మం_*
*_లోకకళ్యాణం..!_*
కృష్ణయ్యా..నీ సాటి ఎవరయ్యా..!!
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
0 Comments