ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

ప్రజా ఆకాంక్షలకనుగుణంగా పనిచేస్తాం. మంత్రి అచ్చన్నాయుడు

ప్రజా ఆకాంక్షలకనుగుణంగా పనిచేస్తాం 
మూడు ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన మంత్రి అచ్చెన్నాయుడు 

కోటబొమ్మాలి, టెక్కలిలో అన్నా క్యాంటీన్లు ప్రారంభం 

టెక్కలి/ కోటబొమ్మాలి, ఆగస్టు 26 :
ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సారధ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుందని, ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. టెక్కలి, కోటబొమ్మాలి లలో సోమవారం మధ్యాహ్నం ఆయన అన్నా క్యాంటీన్లను ప్రారంభించారు. టెక్కలిలో ఆర్టీసీ కొనుగోలు చేసిన మూడు కొత్త బస్సులను జండా ఊపి ప్రారంభించారు. స్వయంగా ఆయన వడ్డించారు. ప్రారంభించిన ఆర్టీసీ బస్సులలో కొద్ది దూరం ప్రయాణించారు. 

 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్ణాటక, తెలంగాణలలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై రాష్ట్ర బృందం అధ్యయనం చేసిందని త్వరలోనే రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. పేదవాడి కడుపు నింపే అన్నా క్యాంటీన్ లను శ్రీ కృష్ణాష్టమి రోజు ప్రారంభించుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. కోటబొమ్మాలిలో ప్రతిరోజూ 400 మందికి, టెక్కలిలో 300 మందికి సరిపడేలా రూ.5 కే మధ్యాహ్న భోజన సదుపాయాన్ని అందజేస్తున్నామన్నారు. ముందు ముందు అల్పాహారం, రాత్రి భోజనాన్ని కూడా ఏర్పాటు చేస్తామన్నారు. 

గత ప్రభుత్వం 13లక్షల కోట్లు అప్పులు చేసిందని, ప్రస్తుతం ఆదాయం కనిపించే పరిస్థితి లేదని, అయినా ఇచ్చిన మాట తప్పకుండా హామీలన్నీ అమలు చేస్తామని, ఇప్పటికే పెన్షన్ల పెంపు, అన్న క్యాంటీన్ల ప్రారంభం జరిగాయన్నారు. జిల్లాలో బదిలీలు పారదర్శకం జరుగుతాయని, దళారులను ఎవరూ ఆశ్రయించవద్దని, అందరికీ న్యాయం చేస్తామని స్పష్టం చేశారు. నియోజకవర్గంలో తాను ఒక పూట ప్రజల నుంచి వినతులు స్వీకరించడానికి, మరో పూట క్షేత్రస్థాయిలో గ్రామాలలో పర్యటించేందుకు నిర్ణయించుకున్నానని ప్రతి వీధి తిరుగుతూ సమస్యలను పరిష్కరిస్తానని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

Post a Comment

0 Comments