ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

మొక్కలు విరివిరిగా నాటాలి: వైస్ చాన్సలర్ రజిని

ఎచ్చర్ల : పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని, ప్రతీ ఒక్కరు పెద్దఎత్తున మొక్కలు నాటాలని డా. బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం వైస్-ఛాన్సలర్ ఆచార్య కె.ఆర్.రజని సూచించారు. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్- క్షేత్ర ప్రచార శాఖ(శ్రీకాకుళం)తో కలిసి డా.బిఆర్ఏయూ శనివారం 'ఏక్ పేడ్ మా కే నామ్(తల్లి పేరిట ఒక మొక్క నాటడం) కార్యక్రమాన్ని నిర్వహించారు. క్యాంపస్ లోని ఇంజినీరింగ్ కళాశాల పరిసరాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఎన్ఎస్ఎస్ వాలంటరీలను ఉద్దేశించి వీసీ మాట్లాడారు. కాలుష్యం అధికం అవుతుండటం, దీని ప్రభావంతో అనారోగ్య సమాజం ఏర్పడుతుందన్నారు. పుట్టిన రోజులు, ప్రత్యేక సందర్భాల్లో ఏక్ పేడ్ మాకే నామ్ లో భాగంగా మొక్కలు విరివిగా నాటడం అలవాటు చేసుకోవాలన్నారు.

సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్-, శ్రీకాకుళంజిల్లా అధికారి బి. తారకప్రసాద్ మాట్లాడు తూ ప్రధాని నరేంద్ర మోదీ ఆలోచనల్లో భాగంగా దేశమంతా పెద్ద ఎత్తున తల్లిపేరిట మొక్క నాటడం కార్యక్రమంలో పాల్గొంటున్నారని, దీనిలో ఆంధ్ర ప్రదేశ్ మరింత ముందుంజలో ఉండాలని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో, డా. బిఆర్ఏయూ రెక్టార్ ఆచార్య బి. అడ్డయ్య, రిజిస్ట్రార్ ఆచార్య సి. సుజాత, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ మరియు ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డా. ఎం. అనురాధ, జర్నలిజం విభాగం అధ్యాపకులు డా. ఆర్.తిరుపతిరావు, డా. జి.లీలా వరప్రసాదరావు, డా. వై.డి. రామదాస్, పీడీ డా. ఎం. శ్రీనువాసు, అధ్యాపకులు ఎం.రామారావు, టి.భవాని తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా, పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులచే నిర్వాహకులు ప్రతిజ్ఞ చేయించారు.

Post a Comment

0 Comments