ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

బెస్ట్ టీచర్ అవార్డు గ్రహీత రామారావుకు ఘన సన్మానం

జలుమూరు:ఉపాధ్యాయ వృత్తిలో విద్యార్థులకు వినూత్నరీతిలో బోధనతోపాటు పరిసరాలను ఆహ్లాదకరంగా తయారుచేసి పాఠశాలను ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్దడమేకాకుండా , గ్రామప్రజలను గ్రామంలోని విద్యావంతులను పాఠశాలలో మమేకంచేసినందుకు, బోధనలో అధునాతన పద్ధతులు ఉపయోగిస్తూ,ఆటపాటల ద్వారా విద్య, మొక్కలు యొక్క గొప్పతనమును విద్యార్థులకు చిన్ననాటి నుండి తెలియజెప్పి పిల్లలతోనే అనేక మొక్కలను నాటించడoవంటి ఎన్నోకార్యక్రమాలు చేపట్టి పాఠశాల ఎన్రోల్మెంట్ కూడా గణనీయంగాపెంచి,పాఠశాలకు, గ్రామానికి మంచి పేరుప్రఖ్యాతలు సంపాదించి పెట్టినందుకు,గ్రామ, మండల,జిల్లా,రాష్ట్ర స్థాయిలో కూడా కొన్ని స్వచ్చంద సేవా సంస్థలనుండి ఎన్నోగౌరవ సత్కారాలుపొందిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు డా,,మెండ.రామారావు గారికి పాఠశాల విద్యా కమిటి & గ్రామస్తులు ఈరోజుస్థానిక పాఠశాలలో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో జలుమూరు మండల విద్యాశాఖధికారి శ్రీ బి. మాధవరావు గారు, స్థానిక బాలికల పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఇప్పిలి. వేణుమాస్టర్ గారు, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ డి.హరిత గారు, పాఠశాల ఉపాధ్యాయులు బి. సతీషకుమార్, సహిత విద్యా బోధకులు పి. రమేష్, పి. కృష్ణప్రసాద్, వైకుంఠరావు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments