*ఘనంగా పవర్ స్టార్ జన్మదినోత్సవ వేడుకలు*
👉విజయవంతమైన మెగా రక్తదాన శిబిరం
👉క్లీన్ ఆంధ్ర - గ్రీన్ ఆంధ్ర లో భాగంగా పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు పంపిణీ
👉మెగా డాన్స్ పోటీలు నిర్వహణ
👉రక్తదాన శిబిరం,మొక్కల పంపిణీ కార్యక్రమాలను ప్రారంభించిన జనసేన నాయకులు,ప్రముఖ వైద్యులు డా.దానేటి శ్రీధర్ వ్యాపారవేత్తలు అంధవరపు ప్రసాద్ ,సంతోష్ , బలభద్రుని రాజా,బహుజన నేత డా.కంఠ వేణు,సీనియర్ జర్నలిస్ట్ సుధీర్ వర్మ, సామాజిక వేత్త గిడుతూరి వెంకటేశ్వరరావుతదితరులు
👉రక్తదాతలను అభినందించి ప్రశంసాపత్రాలు,జ్ఞాపికలను అందజేసిన అఖిలభారత చిరంజీవి యువత వర్కింగ్ ప్రెసిడెంట్ తైక్వాండో శ్రీను,ఉత్తరాంధ్ర ప్రధాన కార్యదర్శి వైశ్యరాజు మోహన్
👉పవన్ కళ్యాణ్ ఆశయాలకి అనుగుణంగా అభిమానులు నడుచుకోవాలి- డా.దానేటి శ్రీధర్
👉సామాజిక సేవా కార్యక్రమాలలో ముందుండేది మెగా అభిమానులే- తైక్వాండో శ్రీను
,శ్రీకాకుళం :
శ్రీకాకుళం జిల్లాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. అఖిల భారత చిరంజీవి యువత వర్కింగ్ ప్రెసిడెంట్ తైక్వాండో శ్రీను ఆధ్వర్యంలో జిల్లా పవన్ కళ్యాణ్ అభిమాన సంఘం అధ్యక్షులు గొర్లె కిరణ్ అండ్ టీం పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక బాపూజీ కళా మందిర్ వద్ద ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. పవర్ స్టార్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని మెగా రక్తదాన శిబిరం,పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కల పంపిణీ,మెగా డ్యాన్స్ పోటీలను ఏర్పాటు చేసారు. దీంతో ఒక్క రోజు ముందుగానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవ వేడుకలు మొదలైనట్లయ్యాయి. జనసేన పార్టీ అధ్యక్షుడు,రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవం సందర్భంగా శ్రీకాకుళంలో ఆదివారం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని,మొక్కలు పంపిణీ చేసే కార్యక్రమాన్ని జనసేన పార్టీ నాయకులు,ప్రముఖ వైద్యులు డా.దానేటి శ్రీధర్ వ్యాపారవేత్తలు అంధవరపు ప్రసాద్ ,సంతోష్ , బలభద్రుని రాజా,బహుజన నేత డా.కంఠ వేణు,వైశ్యరాజు మోహన్ ,సీనియర్ జర్నలిస్ట్ సుధీర్ వర్మ, సామాజిక వేత్త గిడుతూరి వెంకటేశ్వరరావు తదితరులతో కలసి ప్రారంభించారు. పవన్ కళ్యాణ్ అభిమాన సంఘం జిల్లా నేతలు గొర్లె కిరణ్ ,పి. కిరణ్ రెడ్డి,బడే మోహన్ ,భవానీ,పెయ్యల చంటిల సారధ్యంలో మెగా ఫ్యామిలీ అభిమానులు రక్తదానం చేసారు. శ్రీకాకుళం న్యూ బ్లడ్ బ్యాంక్ మేనేజర్ మణికంఠ ఆద్వర్యంలో సిబ్బంది రక్తాన్ని సేకరించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు డా.దానేటి శ్రీధర్ మాట్లాడుతూ సినిమా రంగంలో పవర్ స్టార్ గా స్టార్ డమ్ దక్కించుకున్న పవన్ కళ్యాణ్ రాజకీయ రంగంలో అనతికాలంలోనే తనదైన స్థానాన్ని ప్రజల హృదయాలలో సంపాదించుకున్నారు. ఎన్ డిఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన ఆయన డిప్యూటీ సిఎంగా సుపరిపాలనను అందించే చర్యలు చేపట్టారన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి పర్యావరణ పరిరక్షణకు పవన్ కళ్యాణ్ ఎంతో కృషి చేస్తున్నారన్నారు. పవన్ కళ్యాణ్ అభిమానులంతా కూడా విరివిగా మొక్కలు నాటి ఆయన ఆశయాలను నెరవేర్చేందుకు తమ వంతు పాత్ర పోషించాలన్నారు. పవన్ కళ్యాణ్ మరిన్ని పుట్టిన రోజులు చేసుకుని ప్రజలకి ఇంకా మంచి సేవలు అందించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని డా.దానేటి శ్రీధర్ అన్నారు. ఈ సందర్భంగా వరం తనయులు వ్యాపారవేత్తలు అంధవరపు ప్రసాద్ ,సంతోష్ లు మాట్లాడుతూ మెగా ఫ్యామిలీ అభిమానులను ఎకతాటిపై జిల్లాలో నడిపిస్తూ అనేక సేవా కార్యక్రమాలను తైక్వాండో శ్రీను సారధ్యంలో నిర్వహించడం అభినందనయమన్నారు. పవర్ స్టార్ ,డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవం సందర్భంగా మెగా రక్తదాన శిబిరం,మొక్కల పంపిణీ కార్యక్రమాలను జిల్లాలో ఏర్పాటు చేసి వాటిలో తమను భాగస్వామ్యులను చేయడం ఆనందంగా ఉందన్నారు. మెగా అభిమానులు భవిష్యత్ లో కూడా ఇదే సంప్రదాయాన్ని సేవా రంగంలో కొనసాగించాలని వారు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా అఖిలభారత చిరంజీవి యువత వర్కింగ్ ప్రెసిడెంట్ తైక్వాండో శ్రీను మాట్లాడుతూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే మెగా అభిమానులకి పండుగ రోజన్నారు. ఆయన పుట్టిన రోజును పురస్కరించుకుని ప్రతి ఏడాది లాగనే ఈ సంవత్సరం మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసామన్నారు. డిప్యూటీ సిఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ మొక్కలను ప్రతి ఒక్కరు నాటాలని పిలుపునిచ్చి నేపద్యంలో మొక్కలను పంచే కార్యక్రమం నిర్వహించామన్నారు. అలాగే మెగా డ్యాన్స్ పోటీలను నిర్వహించామన్నారు. వర్షం కురుస్తున్నా కూడా మెగా అభిమానులు,పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ కార్యక్రమాలలో విరివిగా పాల్గొని విజయవంతం చేయడం ఆనందంగా ఉందన్నారు. మెగా రక్తదాన శిబిరం నిర్వహణలో కీలక పాత్ర పోషించిన వారికి ,రక్తదానం చేసిన దాతలకి ,డాన్స్ పోటీలలో పాల్గొన్న విజేతలకి అతిధుల చేతుల మీదుగా మెడల్స్ ,ప్రశంసా పత్రాలను అందజేసారు.జ్ఞాపికలను బహుకరించారు.దుశ్శాలువలతో సత్కరించారు. డాన్స్ పోటీలలో తన ప్రతిభ చూపించిన దివ్యాంగుడు చందుకి రూ 5వేల నగదు పురస్కారాన్ని జనసేన నాయకులు డా.దానేటి శ్రీధర్ అందజేసారు. డాన్స్ పోటీలకి న్యాయ నిర్ణేతగా జోష్ శివ,అరసవల్లి మోహన్ ,సాయిబాబాలు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఎన్ ఎస్ ఎస్ కో-ఆర్డినేటర్ నాగభూషణరావు,ఈవెంట్ ఆర్గనైజర్ సాయిబాబా,నెక్స్ జెన్ కంప్యూటర్ సంస్థ అధినేత సిహెచ్ రఘునాధరావు,వ్యాపారవేత్తలు వైశ్యరాజు శ్రీవర్థన్ ,సింహాద్రి కిరణ్ కుమార్ ,తంగుడు శ్యామ్ ,బరాటం సాగర్ ,ఎస్.వి.సి థియేటర్ మేనేజర్ రవి తదితరులు పాల్గొన్నారు. అలాగే జిల్లా పవన్ కళ్యాణ్ అభియాన సంఘం ప్రతినిధులు గొర్లె చంటి, విజయ్ ,అంబేద్కర్ ,అబ్బాస్ ,దుండు అప్పన్న,చిన్నా, రమేష్ ,మణి,తో పాటు రామ్ చరణ్ యువత ప్రతినిధులు గోవింద్ ,పంకు మురళీ, అల్లు అర్జున్ ఫ్యాన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ శ్రీకాకుళం జిల్లా అద్యక్షుడు తైక్వాండో నవీన్ ,సాయిధరమ్ తేజ్ యువత అధ్యక్షుడు జోగిపాటి వంశీ , కిరణ్ , వరుణ్ తేజ్ ఫ్యాన్స్ అధ్యక్షుడు శీర రాజులతో పాటు మెగా ఫ్యామిలీ హిరోల అభిమానులు పాల్గొన్నారు. పండుగ వాతావరణంలో శ్రీకాకుళంలో తైక్వాండో శ్రీను ఆద్వర్యంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవ వేడుకలు జరుగగా అంతా ఉత్సాహంగా పాల్గొన్నారు.
0 Comments