ఆంధ్రప్రదేశ్, సమగ్ర శిక్ష సొసైటీ (పాఠశాల విద్యా శాఖ) ద్వారా నిర్వహించబడుతున్న కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయము (KGBV)లలో ఖాళీగా ఉన్న బోధనా సిబ్బంది పోస్టులను ఒప్పంద ప్రాతిపాదికన (కాంట్రాక్టు) మరియు బోధనేతర సిబ్బంది పొరుగుసేవల (ఔట్ సోర్సింగ్) ప్రాతిపాదికన 2024-25 విద్యా సంవత్సరం (ఒక సంవత్సరం) కాలానికి భర్తీ చేయుటకు శ్రీకాకుళం జిల్లాలోని అర్హులైన మరియు ఆసక్తి కలిగిన మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులను కొరడమైనది. ఖాళీల వివరాలు: PGT-03, CRT-13, వార్డెన్ -3, పార్ట్ టైం టీచర్-16, అకౌంటెంట్-3, మొత్తం-38 ఆసక్తిగల మహిళా అభ్యర్థులు తమ ఆన్ లైన్ దరఖాస్తులను apkgbv.apcfss.in వెబ్ సైట్ ద్వారా రూ.250/- దరఖాస్తు రుసుము చెల్లించి తేది: 26-09-2024 నుంచి 10-10-2024, సమయం 11-59 pm. నిమిషముల వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు .ఆఫ్ లైన్ / ఫిజికల్ దరఖాస్తులు స్వీకరించబడవు. వయోపరిమితి: ఓపెన్ కేటగిరి అభ్యర్ధులకు 18-42 సంవత్సరాలు, SC, ST, BC లకు, EWS లకు 5 సంవత్సరాలు, మాజీ సైనిక ఉద్యోగినులకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయోపరిమితి సడలింపు కలదు.
ఎస్.తిరుమల చైతన్య అడిషనల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ సమగ్ర శిక్ష, శ్రీకాకుళం జిల్లా వారు తెలియజేసారు.
0 Comments