ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

సాంఘిక శాస్త్ర సిలబస్ భారం తగ్గించాలి.

శ్రీకాకుళం:ఆంధ్రప్రదేశ్ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయ ఫోరమ్ జిల్లా సర్వసభ్య సమావేశం జిల్లా కేంద్రంలోని భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ భవన్ లో జిల్లా అధ్యక్షులు తులగాపు కేశవరావు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కరిమి రాజేశ్వర రావు మాట్లాడుతూ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు నైతిక విలువలు జోడించి బోధించడం ద్వారా నవ సమాజ నిర్మాణానికి పాటుపడాలని సూచించారు. ప్రతి పాఠశాల కు సాంఘిక శాస్త్ర ప్రయోగ శాలను కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు.
జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ సాంఘిక శాస్త్రం లో సిలబస్ భారం తగ్గించాలని, లేనట్లయితే విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా ప్రతి పాఠశాలకు ఇద్దరేసి ఉపాధ్యాయులను కేటాయించాలని డిమాండ్ చేశారు. ఫోరమ్ ఆధ్వర్యంలో నిర్వహించబోయే సాంఘిక శాస్త్ర టాలెంట్ టెస్ట్ ను విజయవంతం చేయాలని వారు కోరారు.నవంబర్ 26 న రాజ్యాంగ దినోత్సవం ను పురస్కరించుకుని సాంఘిక శాస్త్ర దినోత్సవం ను జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో ఘనంగా నిర్వహించాలని వారు పిలుపు నిచ్చారు.జిల్లా ఆర్గనైజింగ్ కన్వీనర్లు మక్కా శ్రీనివాసరావు, ఎల్.గుణశేఖర్ మాట్లాడుతూ సాంఘిక శాస్త్ర సిలబస్ పరిధిని దృష్టిలో పెట్టుకొని పని సర్దుబాటు నుండి సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులను మినహాయింపు ఇవ్వాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయ ఫోరమ్ రాష్ట్ర కార్యదర్శి కరిమి రాజేశ్వర రావు, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తులగాపు కేశవ రావు, బాడాన రాజు, జిల్లా నాయకులు మక్కా శ్రీనివాసరావు, ఎల్.గుణశేఖర్, ఆర్. అన్నాజీ రావు, పి.వి.ఆర్. మూర్తి, టి.రమణ సి.హెచ్.సుబ్బలక్ష్మి,ఎస్. స్వప్న,బి. ముకుంద రావు, కె.సంతోష్ కుమార్, జి.గోపాల రావు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments