ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

చంద్రబాబు నిన్ను ఆ దేవుడు కూడా క్షమించడు: Ex.Dy CM ధర్మాన కృష్ణ దాస్

నర‌సన్నపేట: కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల తిరుపతి వెంకటేశ్వరుని మహా నైవేద్యమైన లడ్డులో కల్తీ జరిగిందని చంద్రబాబు నాయుడు రాజకీయ దుర్బుద్ధితో మాట్లాడిన మాటలపై మాజీ డిప్యూటీ సీఎం జిల్లా పార్టీ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ మండిపడ్డారు. శనివారం పార్టీ అధిష్టానం పిలుపుమేరకు నరసన్నపేట నియోజకవర్గ కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా చంద్రబాబు మాటలు విడ్డూరంగా ఉన్నాయని... కేవలం రాజకీయ దురుద్దేశంతోనే చంద్రబాబు నాయుడు అలా మాట్లాడారని ఆయన దూయ్యిబట్టారు. ఆ దేవదేవుడు శ్రీ వెంకటేశ్వరుడు చంద్రబాబుకు మంచి బుద్ధి ప్రసాదించాలని ఆయన పూజలు చేపట్టారు. సత్యదూరమైన ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని చంద్రబాబు మానుకోవాలని ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలుపై దృష్టి సారించాలని ఆయన హితువు పలికారు. ఈ సందర్భంగా పోలాకి మండలంలోని పిన్నింటి పేట గ్రామంలో.. అలాగే సారవకోట మండలంలోని బుడితి గ్రామంలో.. జలుమూరు మండలంలోని అల్లాడ గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పార్టీ క్యాటర్ తో కలిసి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట ఎంపీపీ ఆరంగి మురళీధర్ జడ్పిటిసి చింతు రామారావు, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు కోరాడ చంద్రభూషణ్ గుప్తా , రాజాపు అప్పన్న, సారవకోట మండల పార్టీ అధ్యక్షులు వంశీకృష్ణ, పిఎసిఎస్ మాజీ చైర్మన్ సురంగి నర్సింగరావు, వైస్ ఎంపీపీ పాగోటి రాజారావు, నర్సంపేట మేజర్ పంచాయతీ సర్పంచ్ బూరెల శంకర్, యువజన విభాగం అధ్యక్షులు పాగోటి గోవిందరావు బుద్దల రాజశేఖర్, మండల పార్టీ ఉపాధ్యక్షులు బగ్గు రమణయ్య, డి ఎల్ డి ఏ అధ్యక్షులు నక్క తులసి దాస్ పారసిల్లి తేజేశ్వరరావు, నిక్కు రాజశేఖర్, వైస్ ఎంపీపీ గుణుపురం రామారావు, తోపాటు సర్పంచులు ఎంపీటీసీలు వార్డు మెంబర్లు తోపాటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments