
నరసన్నపేట:అబ్దుల్ కలాం జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని పెద్ద పెద్ద కలలు కనాలని , గొప్ప విజయాలు సాధించాలని పద్మావతి డిగ్రీ కళాశాల డైరక్టర్ సీహెచ్ దుర్గా ప్రసాద్ అన్నారు. స్థానిక పద్మావతి డిగ్రీ కళాశాలలో అబ్దుల్ కలాం జయంతి మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం కోసం ఆయన చేసిన సేవలు , బోధనలు ఎప్పటికీ మనకి స్ఫూర్తి కలిగిస్తూనే ఉంటాయన్నారు. విద్యార్థులను సమాజంలో విప్లవాత్మకంగా మార్చే భవిష్యత్తు నాయకులుగా మార్చే ప్రయత్నం చేశారని, లక్ష్యాలను నిర్దేశించుకోవడానికి, వాటిని సాధించేలా విద్యార్థులను ప్రేరేపించారని అన్నారు. ఈ కారణంగా కలాం జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ రోజు ప్రపంచ విద్యార్థి దినోత్సవంగా జరుపుకుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల అకడమిక్ ఇంచార్జీ ముకల్ల శ్రీనివాసరావు, అధ్యాపకులు గౌరీ శంకర్ , కె రాము విద్యార్థులు పాల్గొన్నారు.
0 Comments