జలుమూరు తహశీల్దార్ రామారావు శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఆయన గతంలో శ్రీకాకుళం ఆర్డీవో ఆఫీసులో ఏఓ గా పనిచేశారు. సాధారణ బదిలీల్లో భాగంగా జలుమూరుకి బదిలీ అయ్యారు. కాగా నూతనంగా బాధ్యతలు తీసుకున్న ఆయనకు సిబ్బంది పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరి సహాయ సహకారాలతో మండల అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.
0 Comments