నరసన్నపేట : వైఎస్సార్సీపీ సోషల్ మీడియాపై ప్రభుత్వం కక్షకట్టి కేసులు పెడుతోందని జిల్లా పార్టీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణ దాస్ అన్నారు. కృష్ణా జిల్లాలో ఆదివారం ఒక్కరోజే 42 కేసులు పెట్టారని మండిపడ్డారు. శ్రీకాకుళం జిల్లాలో కూడా తమ సోషల్ మీడియా కార్యకర్తలను స్టేషన్లకు పిలిపించి వేధిస్తున్నారని, ప్రశ్నించే గొంతులను నొక్కేస్తారా అంటూ విమర్శించారు. ప్రభుత్వం చేస్తున్న అక్రమాలపై ప్రశ్నించారని కేసులు పెడుతున్నారని, సుప్రీంకోర్టు మార్గదర్శకాలను కూడా పక్కనపెట్టి పోలీసులు వ్యవహరిస్తున్నారని ప్రశ్నించారు. ఎవరి మెప్పుకోసం ఈ కేసులు బనాయిస్తున్నారని, ఎల్లకాలం అధికారం ఒక్కరిదే ఉండదని గుర్తించుకోవాలని ప్రభుత్వ తీరును ఎండగట్టారు.
0 Comments