నరసన్నపేట : కూటమి ప్రభుత్వం బడ్జెట్ పేరుతో దగా చేసిందని, పేద ప్రజల ఆశలను చిదిమేసిందని వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణ దాస్ తీవ్రంగా దుయ్య బట్టారు. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రకటించిన వేళ ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. సూపర్ 6 తొలి హామీ కి చంద్రబాబు ప్రభుత్వం నిధులు కేటాయించ లేదని, నిరుద్యోగులకు బడ్జెట్ లో షాక్ తగిలిందని, రూ.3 వేలు నిరుద్యోగ భృతి ప్రస్తావించకపోవడం మోసగించడమేనన్నారు.
20 లక్షల ఉద్యోగాలు లేదంటే ప్రతీ నిరుద్యోగికి రూ. 3 వేలు భృతి ఇస్తానని ఎన్నికల ప్రచారం హామీ ఇచ్చిన చంద్రబాబు ఏరు దాటాక తప్ప తగలేసిన చందంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఈ బడ్జెట్ లో మహిళలకు ఉచిత బస్ హామీ కాన రావడంలేదని, ఎన్నికల్లో గెలవగానే మహిళలకు ఉచిత బస్ హామీ అమలు చేస్తామన్న చంద్రబాబు తమ కూటమి ప్రభుత్వ కోతల బడ్జెట్ మాత్రమే విడుదల చేసిందని ఒప్పుకోవాలన్నారు. సూపర్ సిక్స్ హామీలు అమలు చేస్తారని ప్రజలంతా ఎదురు చూశారని వారిని దారుణంగా మోసగించారని కృష్ణదాస్ విమర్శించారు.
0 Comments