ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

అసెంబ్లీ సాక్షిగా ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అబద్ధాలు

నరసన్నపేట:అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు వల్లివేయడం ఎమ్మెల్యే కు తగదని.. వాస్తవాలు నరసన్నపేట ప్రజలందరికీ తెలుసునని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంపీపీ ఆరంగి మురళీధర్ జెడ్పీటీసీ చింతు రామారావు, సుడా మాజీ చైర్మన్ కోరాడ చంద్రభూషణ గుప్త, పొందర కార్పోరేషన్ మాజీ చైర్మన్ రాజాపు అప్పన్న, లు దుయ్యబట్టారు. బుధవారం సాయంత్రం నరసన్నపేట వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వీరు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అసెంబ్లీలో వంద పడకల ఆసుపత్రిని తానే అభివృద్ధి చేసినట్టు చెప్పుకోవడం హస్యాస్పదంగా ఉందన్నారు. మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ చొరవతో నరసన్నపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను వంద పడకల ఆసుపత్రిగా రూపుదిద్దుకొందని.. అలాగే ఆసుపత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు కూడా కేవలం ధర్మాన కృష్ణ దాస్ చలవేనని వీరు చెప్పుకొచ్చారు. అలాగే క్రీడల కోటగా ఉన్న నరసన్నపేటలో ఇండోర్ స్టేడియం అవసరమనే ఆలోచన కూడా కృష్ణదాస్ దేనని.. తదుపరి ఇండోర్ స్టేడియం నిర్మాణానికి పూర్తిస్థాయి నిధులు.. బిల్లులు మంజూరు కూడా కృష్ణ దాస్ ఎంతో కృషి చేశారనే విషయాన్ని మర్చిపోయి మాట్లాడడం సరికాదన్నారు. ప్రస్తుతం నరసన్నపేట నియోజకవర్గంలో ఇసుకసురుల రాజ్యం కూటమి ఎమ్మెల్యే నేతృత్వంలోనే జరుగుతోందని.. గోపాలపెంట ఇసుక ర్యాంపు నుండి ఎమ్మెల్యే బంధువులే రాత్రికి రాత్రి వందల కొలది లారీలు అక్రమంగా దోచుకుపోతున్నారని వీరు ఆరోపించారు.
అలాగే నరసన్నపేట నియోజకవర్గంలో మద్యం సిండికేట్ వ్యాపారం, బెల్ట్ షాపులు నిర్వహణ ఎమ్మెల్యే బంధువులు వదలడం లేదని వీరు విమర్శించారు. నరసన్నపేట పట్టణం వైసిపి పాలనలోనే అభివృద్ధి చెందిందని.. పట్టణంలో సెంట్రల్ లైటింగ్, రోడ్డు విస్తరణ, ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్, ఇంటర్నల్ రోడ్స్ వంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన్ని కృష్ణం దాస్ అంకురార్పణ చేశారని వీరు పేర్కొన్నారు. అసెంబ్లీ సాక్షిగా ఎమ్మెల్యే అబద్ధాలు చెప్పినంత మాత్రాన అవి నిజమైపోవని.. క్షేత్రస్థాయిలో వాస్తవాలు కళ్ళకు కట్టినట్టు కనబడుతున్నాయని వేరు చెప్పుకొచ్చారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే అబద్ధాలు ప్రచారం చేయడం మానుకోవాలని వీరు హితువు పలికారు. ఈ కార్యక్రమంలో అటవీశాఖ మాజీ డైరెక్టర్ బొబ్బాది ఈశ్వరరావు, మండల పార్టీ ఉపాధ్యక్షులు బగ్గు రమణయ్య, సర్పంచులు దుల్లా రమణ, సతివాడ రామినాయుడు, బగ్గు సతీష్, కనపల అరవింద్, రావాడ రామారావు, కోటిపల్లి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments