*జిల్లాలో 3 పరీక్ష కేంద్రాలో పరీక్షలు వ్రాయనున్న 1831 మంది అభ్యర్థులు
*గుర్తింపు కార్డులు తప్పనిసరి
*జిల్లా రెవెన్యూ అధికారి అప్పారావు
శ్రీకాకుళం, డిసెంబర్ 17: శాఖాపరమైన పరీక్షలు నిర్వహణకు పగడ్బంది ఏర్పాట్లు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి అప్పారావు అధికారులను ఆదేశించారు.
జిల్లా రెవెన్యూ అధికారి వారి చాంబర్లో ఈ నెల 18 నుండి 23 వరకు 6 రోజుల పాటు శాఖా పరమైన పరీక్షలు నిర్వహణ పై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి మాట్లాడుతూ ఈ నెల 18 వ తేదీ నుండి 23వ తేదీ వరకు 6రోజులు జిల్లాలో 3 పరీక్ష కేంద్రాలను ఎపిపిఎస్సీ ఏర్పాటు చేయడమైనదన్నారు. శ్రీ శివాని ఇంజనీరింగ్ కళాశాల, శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, కోర్ టెక్నాలజీస్ (నరసన్నపేట)కళాశాలలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. గుర్తింపు కార్డులు తప్పనిసరిగా ఉండాలని చెప్పారు. ప్రధమ చికిత్స ఏర్పాట్లు చేయాలని వైద్యాధికారులను ఆదేశించారు. విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని సంబంధిత అధికారులకు తెలిపారు. చీఫ్ సూపరింటెండెంట్లు దృష్టి సారించాలన్నారు. ముందుగానే సిటింగ్ ఏర్పాట్లు, వెలుతురు ఉందా లేదా చూడాలని సూచించారు. సర్వీసు రూల్స్ పుస్తకాలు మాత్రమే తీసుకురావాలని చెప్పారు. పరీక్ష కేంద్రాలకు గంట ముందే చేరుకోవాలని, సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకురావద్దన్నారు.
ఎపిపిఎస్సీ అసిస్టెంట్ సెక్రెటరీ వెంకట లక్ష్మీ మాట్లాడుతూ ఈ పరీక్షలకు 1831 మంది ఉద్యోగులు హాజరుకానున్నట్లు వివరించారు. ఉదయం 10.00 గంటలు నుండి 12.00 గంటల వరకు మధ్యాహ్నం 03 నుండి 05.00 గంటల వరకు ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుందన్నారు. ఇలాగే ఉదయం 10.00 గంటల 12.00 వరకు, మధ్యాహ్నం 03:00 గంటల నుండి 05:00 గంటల వరకు ఉంటుందని, డిస్క్రిప్టివ్ ఉంటుందని చెప్పారు. అభ్యర్థులు నిర్దేశిత సమయానికి ముందుగా చేరుకోవాలన్నారు. అలాగే సిసి కెమెరాల పర్యవేక్షణ పై దృష్టి సారించాలన్నారు.
ఉదయం నిర్వహించనున్న పరీక్షకు 08.30 నుండి 9.30 వరకు, అలాగే మధ్యాహ్నం నిర్వహించనున్న పరీక్షకు 01.30 నుండి 2.30 వరకు గ్రేస్ పీరిడ్ తో కలిపి అనుమతించబడునని అన్నారు.
ఈ సమావేశంలో ఎపిపిఎస్సీ అసిస్టెంట్ సెక్రెటరీ వెంకట లక్ష్మీ, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఎం అమ్మాజీ, హెచ్ సెక్షన్ సూపరేంటెండెంట్ చక్రవర్తి, అదనపు జిల్లా వైద్య ఆరోగ్య అధికారి శ్రీకాంత్, సిఐ దేవరకొండ ప్రసాద్, శాఖల అధికారులు, సిబ్బంది ఆయా కళాశాలల ప్రతినిధులు, సెక్షన్ ఇన్ఛార్జ్ లు, తదితరులు పాల్గొన్నారు.
0 Comments