ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

పార్టీలకు అతీతంగా మండలాన్ని అభివృద్ధి చేసుకుందాం

*పార్టీలకు అతీతంగా మండలాన్ని అభివృద్ధి చేసుకుందాం.

*జలుమూరు మండల సాధారణ సర్వసభ్య సమావేశంలో..

*శాసనసభ్యులు శ్రీ బగ్గు రమణ మూర్తి

*జలుమూరు,డిసెంబర్ 20:

 జలుమూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో శుక్రవారం సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహణ ఎంపీపీ అధ్యక్షతన జరిగింది.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి హాజరై నరసన్నపేట నియోజకవర్గం, జలుమూరు మండలానికి సంబంధించి గత సమీక్షలో జరిగిన అంశాల అమలుపై ఆరాతీశారు. అనంతరం శాసనసభ్యులు గారు మాట్లాడుతూ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు నిర్దేశిత సమయంలో పూర్తి అయ్యేందుకు సరైఅయిన ప్రణాళికలు రూపొందించు కోవాలన్నారు.అలాగే అర్హులైన ప్రతీ లబ్దిదారునికి సంక్షేమ కార్యక్రమాలు సకాలంలో అందేలా చర్యలు చేపట్టాలని అధికారులకు కోరారు.

ఈ సమావేశంలో ఎంపీపీ, తహశీల్దార్,ఎంపీడీవో, మండల సర్పంచులు,ఎంపీటీసీ సభ్యులు,అన్ని శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments