*విద్యుత్ చార్జీల పెంపుపై నిరసన.
*అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో పెద్ద ఎత్తున చేపట్టాలి.
*వైస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణ దాస్.
*నరసన్నపేట పార్టీ కార్యాలయం లో పోస్టర్ ఆవిష్కరణ
నరసన్నపేట: చంద్రబాబు పాలనలో విద్యుత్ చార్జీల పెంపు భారాన్ని మోపడాన్ని నిరసిస్తూ ఈ నెల 27న జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో వైఎస్సార్సీపీ పోరుబాట పేరిట ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షులు మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణ దాస్ తెలిపారు. రాష్ట్ర ప్రజలపై ఏకంగా రూ.15,485 కోట్ల భారాన్ని మోపుతూ, చార్జీల పెంపునకు నిరసనగా వైఎస్సా ర్సీపీ అధినేత వైఎస్ జగన్ పిలుపు మేరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మంగళవారం ఉదయం నరసన్నపేట పార్టీ కార్యాలయం లో పత్రిక సమావేశం లో మాట్లాడారు . ఎన్నికలకు ముందు ప్రజలకు చంద్రబాబు అనేక హామీలిచ్చారని, అందులో భాగంగా తాము అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీల పెంపుదల ఉండదని ప్రజలను నమ్మించారని కృష్ణదాస్ గుర్తుచేశారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన ఆర్నెలల్లోనే ప్రజలపై రూ.వేలకోట్ల భారాన్ని మోపుతున్నారని, గతంలోనూ విద్యుత్ సంస్కరణల పేరుతో ప్రజలను అనేక కష్టాలకు గురిచేసిన చరిత్ర చంద్రబాబుదని చెప్పారు. నేడు రాష్ట్రంలో మళ్లీ అదే చంద్రబాబు వల్ల విద్యుత్ చార్జీల భారాన్ని మోయలేక ప్రజల నడ్డి విరుగుతోందన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలకు అండగా వైఎస్సార్సీపీ ఈ నెల 27న తలపెట్టిన నిరసన కార్యక్రమాలకు అన్ని వర్గాల ప్రజలు మద్దతు తెలపడంతోపాటు పెద్ద ఎత్తున ఈ నిరసన కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ఆయన కోరారు. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలని కృష్ణదాస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ సమావేశం లో నరసన్నపేట నియోజకవర్గ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
0 Comments