ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

మోదీ పర్యటన విజయవంతం చేద్దాంఉత్తరాంధ్ర వైభవాన్ని చాటి చెబుదాం. మంత్రి అచ్చన్న

*ఉత్తరాంధ్ర వైభవాన్ని చాటి చెబుదాం

*రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు

*ప్రధాని మోదీ విశాఖ పర్యటన విజయవంతం చేద్దాం

ప్రధాని మోదీ విశాఖ పర్యటన విజయం చేద్దామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఈనెల 8 తేదీన విశాఖపట్నం రానున్న నేపథ్యంలో సహచర మంత్రులు, పార్లమెంట్ సభ్యులు ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి విశాఖ సర్కుట్ హౌస్ లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బహిరంగ సభ చరిత్రలో నిలిచిపోయే విధంగా చేద్దామని అన్నారు. ఉత్తరాంధ్ర వైభవాన్ని చాటి చెప్పే విధంగా ఉండాలని అన్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రధానమంత్రి మోదీ శంకుస్థాపన చేయరున్నారని తెలిపారు. 
రాష్ట్ర అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందని అన్నారు.
ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా అని ఏర్పాట్లు పూర్తి చేద్దామని అన్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు, అందరూ సహకారంతో మోదీ పర్యటన విజయవంతం చేద్దామని అన్నారు. పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్, స్థానిక నేతలు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments