శ్రీకాకుళం, డిసెంబర్ 20: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో శ్రీకాకుళం జిల్లా అంతటా విస్తారంగా వర్షాలు పడుతున్నాయని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు.
ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో పండిన వరి పంట నష్టపోకుండా ఉండేందుకు అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు చేపట్టామన్నారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ధాన్యం సేకరణ లో కొంతవరకు జాప్యత ఎదురవుతున్నాయని. రైతులు ఎటువంటి భయాందోళన చెందనవసరం లేదని కలెక్టర్ అభయమిచ్చారు.. తడిసి ముద్దయిన.. రంగు మారిన ధాన్యం కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని చెప్పారు. పొలాల్లో ఉన్న వరి పంట సురక్షితంగా ఉండేందుకు తార్బాన్స్ సరఫరా చేస్తున్నామని. అవసరమైన రైతులు సంబంధిత మండల రెవెన్యూ అధికారులను సంప్రదించాలని సూచించారు. నిన్నటికి జిల్లాలో 16.5 మిల్లీ మీటర్లు వర్షం నమోదు అయిందని ఈ రోజు జిల్లా అంతటా గత రాత్రి నుండి ఎడతెరువు లేకుండా వర్షం కురుస్తుందన్నారు. శ్రీకాకుళం, ఎచ్చెర్ల, ఆమదాలవలస,నరసన్నపేట నియోజక వర్గాల పరిధిలో కొంతవరకు వరికోతలు చేసిన ధాన్యం పొలాల్లో ఉందని ముందస్తు హెచ్చరికల నేపథ్యంలో రైతులు పండించే ధాన్యాన్ని వరి కుప్పల రూపంలో పొలాల్లో సురక్షితంగా వుంచుకున్నారన్నారు. లోతట్టు ప్రాంతాల్లోని రైతులకు కొంత వరకు ఇబ్బందులు ఉన్నాయని అట్లాంటి వారి కొరకు జలవనరుల శాఖ అధికారులకు సమాచారం ఇచ్చామని రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేస్తున్నామన్నారు. తుఫాన్ ప్రభావం వల్ల శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నామని దీని కొరకు జాయింట్ కలెక్టర్ సారధ్యంలో ఒక ప్రత్యేక బృందం పనిచేస్తుందని అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో 70 శాతం వరి కోతలు పూర్తి అయ్యాయని స్పష్టం చేశారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయటమే తమ ప్రథమ కర్తవ్యమని అన్నారు.
0 Comments