*శాసన సభ్యులు గొండు శంకర్ వెల్లడి
శ్రీకాకుళం,జనవరి,6: స్వయం సహాయక సంఘాల మహిళలు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని స్థానిక శాసన సభ్యులు గొండు శంకర్ వెల్లడించారు. మున్సిపల్ గ్రౌండ్ లో జనవరి 6 నుండి 11 వరకు ఏర్పాటు చేసిన సిక్కోలు డ్వాక్రా బజార్-2025 ప్రారంభోత్సవ కార్యక్రమానికి సోమవారం ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళైన డొక్కా సీతమ్మ పేరున మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మహిళలు వారి కాళ్లపై నిలబడి ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో మహిళా స్వయం సహాయక సంఘాలను అప్పట్లో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విజన్-2047 నాటికి ప్రతీ ఇంటికి ఒక పారిశ్రామిక వేత్త ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. ఇంటికో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ వలే ఇంటికో పారిశ్రామిక వేత్తలుగా మహిళలు ఎదగాలన్నారు. సిక్కోలు డ్వాక్రా బజార్ లో ఈ వారం రోజుల్లో రెండు కోట్ల రూపాయలు వ్యాపారం జరగాలన్నారు. రథసప్తమిలో జిల్లా ఉత్పత్తులను విక్రయాలు చేసేందుకు స్థలం కేటాయిస్తామని చెప్పారు. రానున్న రోజుల్లో మహిళలు లక్షాధికారులు కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఇందుకోసం కోట్ల రూపాయలు నిధులు కేటాయించినట్లు తెలిపారు. మహిళలంతా ప్రభుత్వానికి అండగా ఉండాలని పిలుపునిచ్చారు. జిల్లాలో 45 వేల స్వయం సహాయక సంఘాల గ్రూపుల్లో ఐదు లక్షల మంది మహిళలు ఉన్నట్లు చెప్పారు. వ్యవసాయ పని ముట్లు, డ్రోన్లు ఇస్తామన్నారు. ఈ సందర్భంగా ఆయన మహిళలకు ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. *సుడా అధ్యక్షులు* కొరిగాన రవి కుమార్ మాట్లాడుతూ సమాజం అభివృద్ధి చెందాలంటే స్త్రీ శక్తి అభివృద్ధి చెందాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చూపిన ముందు చూపు వలన ఎంతో మంది మహిళలు అభివృద్ధి చెందుతున్నట్లు పేర్కొన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మహిళలను వీర మహిళలని అభివర్ణిస్తారన్నారు. జిల్లాలో తయారవుతున్న ఉత్పత్తులను జిల్లాలోనే కాకుండా ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు ఎగుమతి చేసి జిల్లా ఖ్యాతిని ఇనుడింపచేయాలన్నారు. మహిళలకు కూటమి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. వంశధార ప్రాజెక్టు కమిటీ ఛైర్మన్ రవీంద్ర మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మొట్టమొదటిగా డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మహిళా శక్తిని ముఖ్యమంత్రి గుర్తించి వారి చేతిలో కోట్ల రూపాయలు పెడుతున్నట్లు పేర్కొన్నారు.
వివిధ బ్యాంకుల ఆర్ఎంలు మాట్లాడుతూ మహిళల 20 లక్షల రూపాయలు వరకు రుణాలు పొందవచ్చన్నారు. మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని కోరారు. ఎంఎస్ఎంఈ యూనిట్ ఏర్పాటు చేసుకోవచ్చని తెలిపారు. నాబార్డ్ డిడిఎం కె. రమేష్ కృష్ణ మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాల మహిళలు ఆర్థికంగా అభివృద్ధి సాదించాలన్నారు. వివిధ బ్యాంకుల రుణాలను సద్వినియోగం చేసుకొని పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలన్నారు. డిఆర్డిఎ పిడి కిరణ్ కుమార్ మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం మహిళలు కోటీశ్వరులు కావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు. 26 జిల్లాల నుండి స్టాల్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మహిళలు పారిశ్రామిక, వ్యాపార వేత్తలు కావాలన్నారు. మహిళలకు రుణాలు ఇచ్చేందుకు వివిద బ్యాంకులు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు బానుమతి, ఉపాధ్యక్షురాలు, మెప్మా మహిళా అధ్యక్షురాలు మాట్లాడుతూ ప్రభుత్వం మహిళలకు మంజూరు చేస్తున్న రుణాలు ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెంది పారిశ్రామిక వేత్తలుగా వృద్ధి చెందాలన్నారు.
ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం *సిక్కోలు డ్వాక్రా బజార్* ను ఆయన ప్రారంభించారు. అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శించారు. ఈ కార్యక్రమంలో వంశధార ప్రాజెక్టు కమిటీ ఛైర్మన్ రవీంద్ర, వివిధ కార్పొరేషన్ డైరెక్టర్లు, స్వయం సహాయక సంఘాల మహిళలు, తదితరులు పాల్గొన్నారు.
0 Comments