నరసన్నపేట :ప్రపంచ ప్రసిద్ధ పుణ్యక్షేత్రంలో తొక్కిసలాట కారణంగా భక్తులు మృతికి ప్రభుత్వ వైఫల్యమే కారణమని, భద్రతను గాలికి వదిలేసి ఆరుగురు మృతి ఘటనపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని మాజీ డిప్యూటీ సీఎం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణ దాస్ డిమాండ్ చేశారు. ' ఇది ప్రభుత్వం చేసిన తప్పు. ప్రభుత్వమే దీనికి పూర్తి బాధ్యత తీసుకోవాలి. చనిపోయిన వ్యక్తుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.50 లక్షల నష్టపరిహారం ఇవ్వాలి. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి.. ప్రభుత్వం తప్పిదంగా ఒప్పుకుంటూ ఉచిత వైద్యం అందించాలి. వారు డిశ్చార్జి అయి ఇంటికి వెళ్లేటప్పుడు కనీసం రూ.5 లక్షలు అందించాలని చంద్రబాబును డిమాండ్ చేస్తున్నాం '. అని కృష్ణ దాస్ శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
ఈ ఘటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు, హోం మంత్రి, దేవాదాయ శాఖ మంత్రి, టీటీడీ చైర్మన్, ఈవో, అడిషనల్ ఈవో, ఎస్పీ, కలెక్టర్, రెవెన్యూ అధికారులు అందరూ బాధ్యత వహించాల్సిందేనని
అన్నారు. గతంలో గోదావరి పుష్కరాల సమయంలో 29 మందిని పొట్టన పెట్టుకున్న ఘనత ఈ చంద్రబాబుది కాదా? అంటూ ఆయన ప్రశ్నించారు.
0 Comments