ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

చెవిరెడ్డి అరెస్ట్.. చంద్రబాబు ప్రభుత్వం బరితెగింపు. మాజీ ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణ దాస్

శ్రీకాకుళం:వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పారదర్శకంగా అమలు చేసిన మద్యం విధానంపై కుట్రపూరితంగా, రెడ్‌బుక్ ఆధారంగా తప్పుడు కేసు నమోదు చేసి, ప్రజా నేతలను వేధించడమే లక్ష్యంగా కూటమి సర్కార్ అరాచకానికి పాల్పడుతోంది మాజీ ఉపముఖ్యమంత్రి, వైస్సార్ సీపీ జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణ దాస్ మండిపడ్డారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ కుట్రలో భాగంగానే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ని అక్రమంగా అరెస్టు చేసిన విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

అబద్దపు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలతో కుట్ర పన్నుతూ, చంద్రబాబు ప్రభుత్వ పాలనలో ప్రజాస్వామ్యాన్ని పాడు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. బెంగళూరులోని విమానాశ్రయంలో చెవిరెడ్డి ని అదుపులోకి తీసుకునే వరకు వారు ఈ కేసులో నిందితులుగా నమోదు కాలేదని, అయినా వారిపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేసి అడ్డుకోవడం నిబంధనలకు పూర్తిగా విరుద్ధమని దుయ్యబట్టారు.

ఇప్పటికే చెవిరెడ్డి పలుమార్లు ప్రకటించినట్లు తాను ఎప్పుడైనా విచారణకు సిద్ధమని, చిన్న ఉద్యోగులను ఇబ్బంది పెట్టకండని, తాను పారిపోవడం లేదని మీడియా ద్వారా స్పష్టం చేశారు. అయినప్పటికీ సిట్ రహస్యంగా చర్యలు చేపట్టి లుక్ అవుట్ నోటీసులతో అరెస్ట్ చేయడం దుర్మార్గమన్నారు.

ఇది చంద్రబాబు సర్కార్ బరితెగింపు పాలనకు, ప్రజాస్వామ్య పరిరక్షణపై జరిపే పోరాటాలను అణిచివేయాలన్న కుట్రకు నిదర్శనంగా నిలుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అరెస్ట్‌ను తక్షణమే ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. ప్రజా స్వరాన్ని అణచే ప్రయత్నాన్ని ఏమాత్రం సహించమని, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఈ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని ఆ ప్రకటనలో తెలిపారు.

Post a Comment

0 Comments