పోలాకి మండలం, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ -ఏప్రిల్ 09 2025
ప్రజాసమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకే ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామని శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి గారు అన్నారు . బుధవారం కత్తిరివానిపేట క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో పెద్దఎత్తున ప్రజలు వినతులు అందజేశారు. తాగునీటి సమస్యలు, రెవెన్యూ సమస్యలు, రేషన్ కార్డులు, పింఛన్లు, ఇల్లు స్థలాలు, గ్రామాల్లో రోడ్లు డ్రైనేజీలు మరియు మౌలిక సదుపాయాలు వంటి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అర్జీలు అందజేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు కావస్తున్నా గత వైసిపి పాలనలో పరిష్కారం కానీ ఎన్నో సమస్యలతో ప్రజలు నేటికీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.ఈ సమస్యలు అధికారులు ఎక్కడా కూడా అలసత్వం వహించకుండా తక్షణమే సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజా దర్బార్ నందు వచ్చే ఫిర్యాదుల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు , కార్యకర్తలు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
0 Comments