నరసన్నపేట పట్టణంలో 10వ వార్డులో మఠంవీధి, భైరాగవీధి, మార్కెట్ వీధుల్లో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి శుక్రవారం చేపట్టారు.ఈ సందర్బంగా ఇంటి ఇంటికి వెళ్లి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సుపరిపాలన ప్రగతిని వివరిస్తూ ప్రజలనుండి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వచ్చిన సమస్యలను సంబంధించిన అధికారులకు ఫోన్లో తెలియజేసి పరిష్కరించారు. ఆగస్టు 15న మహిళలకు ఉచిత బస్ పథకం కల్పించడమే కాకుండా త్వరలోనే నిరుద్యోగులకు నిరుద్యోగ భృతిని కూడా అందించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చర్యలు చేపట్టారని ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇంచార్జ్ బగ్గు అర్చన, సర్పంచ్లు,ఎంపీటీసీ సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు మండల, పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
0 Comments