ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

నవంబర్ 5న మాత్రమే బాలి జాతర నిర్వహించాలి.

శ్రీకాకుళం:దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీముఖలింగేశ్వర క్షేత్రంలో గత సంవత్సరం అనధికారంగా బాలి జాతర నిర్వహించారని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ కు సోమవారం స్పందనలో పిర్యాదు చేశామని శ్రీముఖలింగేశ్వర ఆలయ ప్రధాన అర్చకులు నాయుడు గారి రాజశేఖర్ తెలిపారు. అధికారకంగా నవంబర్ 5 కార్తీక పౌర్ణమి రోజున నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అనుమతులు ఇవ్వాలని కోరారు.వాస్తవానికి భారతదేశంలో ఒరిస్సా రాష్ట్రంలో కటక్ లో మాత్రమే ఈ యాత్రను కొన్ని దశాబ్దాలుగా ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం లాంచనంగా నిర్వహిస్తుందన్నారు. అంతస్థాయిలో కాకపోయినా జిల్లా స్థాయిలో ప్రస్తుతానికి అనుమతులు వస్తే తద్వారా కొన్ని ఏళ్ల తర్వాత కటక్ మాదిరిగా డివోషనల్ అండ్ ట్రేడ్ ఫెయిర్ నిర్వహించటకు వీలు పడుతుందన్నారు.ఈ బాలి జాతర కటక్ లో ఆసియాలోనే అతిపెద్ద ఓపెన్ ట్రేడ్ ఫెయిర్ గా రూపుదిద్దుకుందని,అంత స్థాయిలో కాకపోయినా రాష్ట్రస్థాయిలోనైనా అధికారికంగా నిర్వహిస్తే ఆలయంతో పాటు జిల్లాకి పేరు ప్రఖ్యాతలు వస్తాయని తెలిపారు.ఈ విషయం పై స్పందించిన జిల్లా కలెక్టర్ నవంబర్-5 కి అనుమతులు తక్షణమే ఇవ్వమని ఆర్.డి.ఓ కి ఆదేశాలు ఇచ్చారని తెలిపారు.
వాస్తవానికి కార్తీక పౌర్ణమి..నవంబర్-5 న మాత్రమే బాలి జాతర నిర్వహించాలి. కానీ చరిత్ర వక్రీకరించి వారికి పూజలు ఉన్నాయని, నవంబర్ 9 ననిర్వహిస్తామన్నారని పిర్యాదు చేశానని తెలిపారు.ఆలా నవంబర్-9 న నిర్వహిస్తే చరిత్ర వక్రీకరించడం కాదా అని ప్రశ్నించారు. ఆ విధంగా చేస్తే అది అప్పుడు బాలి జాతర కాదని, కబాలి జాతర అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కావున నవంబరు ఐదున మాత్రమే బాలీ జాతర నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కు కోరామని, అందుకు కలెక్టర్ సానుకూలంగా స్పందించారని తెలిపారు.

Post a Comment

0 Comments